కన్నపిల్లలను వద్దనుకొని ప్రియుడి మోజులో పడి ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ కుమార్తె తీరు నలుగురి ప్రాణాలు తీసింది. కన్నబిడ్డ ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అవమానంగా భావించిన ఆ తల్లి… తన కన్నతల్లికి చెప్పుకొని ఆవేదన చెందింది. ఇంత పరువు పోయాక ఇక బతకడం దేనికి అనుకొని ఆ తల్లి, అమ్మమ్మ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపైన తాము కూడా ఉరేసుకొన్న విషాద ఘటన తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధం నలుగురి ప్రాణాలు తీసింది… కుమార్తె వేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపంతో ఆమె తల్లి, అమ్మమ్మ.. తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు.. పరువు కోసం పాకులాడిన ఆ తల్లీ కూతుళ్లు తమ ప్రాణాలు తీసుకున్నారు. అంతే కాదు అంతకు ముందే తమ మనవరాళ్లను కూడా చంపేశారు.. ఈ విషాద ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో జరిగింది…
Off The Record: వైఎస్ జగన్ పర్యటనలపై వైసీపీ నేతలు కంగారు పడుతున్నారా? ఎందుకా కంగారు..?
లిథిక్స, దీపికాతో కలిసి తల్లి కాళీశ్వరి ఇంట్లో ఉంటున్న పవిత్ర. దిండిగల్ జిల్లా ఓట్టన్‌సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టికి చెందిన పవిత్రకు తొమ్మిదేళ్ల కిందట వివాహామైంది. మొదట్లో బాగానే ఉన్నా కొద్దికాలం తరువాత ఆ దంపతుల మధ్య గొడవలు మొదలైయ్యాయి. భర్తతో ఇక ఉండలేనంటూ తల్లికి చెప్పుకుని బాధ పడింది పవిత్ర. కూతురు బాధ తట్టుకోలేక అ తల్లి కూతుర్ని తిరిగి ఇంటికి తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి పవిత్ర తన కుమార్తెలు లిథిక్స, దీపికాతో కలసి చిన్నకులిప్పట్టిలోని తల్లి కాళీశ్వరి ఇంట్లో ఉంటోంది. స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది…పవిత్ర
ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఇలా ప్రశాంతంగా సాగుతున్న పవిత్ర జీవితంలోకి రాజేష్ అనే యువకుడు ఎంటరయ్యాడు. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడు మోజులో పడిన పవిత్ర..కుటుంబాన్ని, పిల్లలను వదిలేసుకోవాలని నిర్ణయించుకుంది. రాజేష్‌తో వెళ్లిపోయి హాయిగా బతకాలని డిసైడ్ అయింది. దీంతో తన ప్లాన్‌లో భాగంగా ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు…
ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత పవిత్ర.. తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు పవిత్ర తల్లిదండ్రులు. తీవ్రమైన మనస్తాపం చెందిన తల్లి కాళీశ్వరి.. ఈ విషయాన్ని తన తల్లి చెల్లమ్మాల్ తో చెప్పుకుని కన్నీటి పర్యంతమయింది. వారిద్దరూ తమ పరువు పోయిందని భావించారు. ఇక బతకడం తన వల్ల కాదంటూ చెప్పడంతో ఇద్దరు కలిసి మనవరాళ్లు లిథిక్సా, దీపికాను ఉరికి వేలాడదీశారు. ఆపై వారిద్దరు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. . ఈ ఘటన తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పవిత్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు…
Off The Record: సీఎం రేవంత్ ని నాడు వద్దన్న నేతలే.. నేడు పోటీ పడి పిలుస్తున్నారా?
