NTV Telugu Site icon

Tamil Nadu: బస్ డ్రైవర్కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని రక్షించి ప్రాణాలు వదిలిన డ్రైవర్

Heart Attack

Heart Attack

ఈ మధ్య కాలంలో గుండెపోటు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. అప్పటి వరకే బాగానే ఉంటూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో కంటే చాలా ఎక్కువగా, సడన్ గా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కలుగుతోంది. ఇదిలా ఉంటే.. తమిళనాడులో స్కూల్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో చనిపోయి.. మరో 20 విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు.

CM Revanth Reddy: సెక్రటేరియట్‌లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో 49 ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపి సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. అనంతరం.. కొద్దిసేపటికే అతను కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు. తాను చనిపోయే ముందు డ్రైవర్ చేసిన ఈ పనికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ సంఘటన జూలై 24 బుధవారం రోజున జరిగింది. వెల్లకోయిల్‌లోని ANV మెట్రిక్ స్కూల్ నుండి విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపడానికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఛాతిలో నొప్పి రావడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపాడు. అయితే.. అతని భార్య కూడా అదే స్కూల్‌లో హెల్పర్‌గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.

Minister Uttam Kumar Reddy: కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే.. ఈ ప్రాజెక్టు విషయంలో అన్ని అబద్ధాలే చెప్పారు..

మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ వీరోచిత చర్యను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సహా పలువురు కొనియాడారు. “తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము.” అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించగా.. మంత్రి ఎంపీ సామినాథన్‌ మృతుడి కుటుంబానికి చెక్కును అందజేశారు. మరోవైపు.. బస్సు డ్రైవర్‌కు శుక్రవారం ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.

Show comments