Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tamil Nadu Election Results 2026 Vijay Tvk Rise Mgr Comparison

Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి ‘ఎంజీఆర్’ చరిత్రను తిరగరాస్తున్న విజయ్!

Published Date :May 4, 2026 , 1:45 pm
By RAMAKRISHNA KENCHE
Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి ‘ఎంజీఆర్’ చరిత్రను తిరగరాస్తున్న విజయ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay TVK: తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక నూతన అధ్యాయానికి తెరలేపాయి. ఒకప్పుడు ఎం.జి. రామచంద్రన్ (MGR) సృష్టించిన ప్రభంజనాన్ని తలపిస్తూ, దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీతో కోటను ఢీకొంటున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఓట్ల లెక్కింపు సరళిని గమనిస్తే, విజయ్ పార్టీ దాదాపు 100 నుంచి 118 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతోంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 118 మార్కును విజయ్ చేరుకుంటే, సుమారు 49 ఏళ్ల తర్వాత ఓ నటుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రికార్డు ఆయన సొంతమవుతుంది. గతంలో ఎంజీఆర్ 1977లో ఘనవిజయం సాధించి దశాబ్ద కాలం పాటు పాలించారు. ఆ తర్వాత జయలలిత వంటి నటీమణులు ముఖ్యమంత్రులు అయినప్పటికీ, వారు ఎంజీఆర్ స్థాపించిన పార్టీని వారసత్వంగా స్వీకరించిన వారే తప్ప, సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి రాలేదు. కానీ విజయ్ ప్రస్థానం భిన్నంగా సాగింది. 2009లోనే తన అభిమాన సంఘాలను ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో సేవా సంస్థగా మార్చిన ఆయన, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మద్దతుదారులు సాధించిన విజయం, విజయ్ క్రేజ్ కేవలం సినిమాలకే పరిమితం కాదని, అది ఓట్ల రూపంలోకి మారుతుందని నిరూపించింది.

ఫిబ్రవరి 2024లో టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్, తన సినీ కెరీర్‌కు స్వస్తి పలుకుతూ రాజకీయాలే నా గమ్యమని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలు, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలపై ఆయన సాగించిన పోరాటం యువతను, తొలిసారి ఓటు వేస్తున్న వారిని విశేషంగా ఆకర్షించింది. ముఖ్యంగా డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వంద్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తనను తాను నిలబెట్టుకోవడంలో ఆయన విజయం సాధించారు. 2025లో కరూర్‌లో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో విజయ్ వ్యవహరించిన తీరు, ఒక పరిణతి చెందిన నాయకుడిని ప్రజలకు పరిచయం చేసింది. ప్రస్తుత ఫలితాల ట్రెండ్స్ గనుక నిజమైతే, తమిళనాడు రాజకీయాల్లో మూడవ శక్తిగా విజయ్ అవతరించడం ఖాయం. ఒకవేళ స్పష్టమైన మెజారిటీ రాకపోయినా, ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. దశాబ్దాలుగా రెండు ద్రావిడ పార్టీల మధ్యే సాగుతున్న పోరుకు చెక్ పెడుతూ, విజయ్ సృష్టించిన ఈ మార్పు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేలా కనిపిస్తోంది. ఫోర్ట్ సెయింట్ జార్జ్ (అసెంబ్లీ) మెట్లు ఎక్కి విజయ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Also Read

  • Mamata Banerjee: "ఓట్లను దోచుకున్నారు".. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..
  • Vijay Emerges as King: అందరూ కింగ్‌మేకర్ అన్నారు.. విజయే ‘కింగ్’ అవుతాడని చెప్పింది ఆ ఒక్కడే..
  • West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..
  • Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DMK AIADMK alternative
  • MGR comparison
  • Tamil Nadu Elections 2026
  • Tamil politics change
  • TN election results

తాజావార్తలు

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Vijay TVK: సినిమా నుంచి అసెంబ్లీకి.. 49 ఏళ్ల క్రితం నాటి ‘ఎంజీఆర్’ చరిత్రను తిరగరాస్తున్న విజయ్!

  • Mamata Banerjee: “ఓట్లను దోచుకున్నారు”.. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..

  • Vijay Emerges as King: అందరూ కింగ్‌మేకర్ అన్నారు.. విజయే ‘కింగ్’ అవుతాడని చెప్పింది ఆ ఒక్కడే..

  • West Bengal Results: మమతా బెనర్జీ నివాసం ముందు బీజేపీ ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు..

  • Prashant Kishor: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సర్ప్రైజ్.. వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ కామెంట్స్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions