Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tamil Nadu Election Counting Vijays Tvk Strategy Resort Politics Create Buzz

Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ

Published Date :May 4, 2026 , 7:17 am
By Sudhakar Ravula
Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tamil Nadu Eections 2026: తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత విజయ్ ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కౌంటింగ్ హాళ్ల నుంచి వారిని సురక్షితంగా తరలించేందుకు విజయ్ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహాబలిపురంలో రిసార్ట్ బుక్ చేయడం ద్వారా ‘క్యాంప్ పాలిటిక్స్’కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులను మహాబలిపురం రిసార్ట్‌కు తీసుకెళ్తారా లేదా మరే రహస్య ప్రదేశంలో ఉంచుతారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.

ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత టీవీకే పార్టీ వ్యూహాల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పోరులో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ముందుగానే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో మొత్తం 85.10 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొనడం విశేషం.

Also Read

  • Assam Assembly Election Results: హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా.. ఈసారి జలుక్‌బరి స్థానంలో ఎవరు గెలుస్తారు?
  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..
  • Mamata Banerjee: ‘‘కరెంట్ తీసేస్తున్నారు’’.. ఓట్ల లెక్కింపునకు ముందు మమతా సంచలన ఆరోపణ..
  • Mansarovar Yatra: మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..

రాష్ట్రవ్యాప్తంగా 62 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుండగా, ఈవీఎంల కోసం 3,324 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం 993 టేబుళ్లు, సర్వీస్ ఓటర్ల కోసం 294 టేబుళ్లు ఏర్పాటు చేశారు. చెన్నై జిల్లాలోనే అత్యధికంగా 291 టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ నిర్వహణ కోసం 1,135 మంది అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించగా, మొత్తం 10,545 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. భద్రత పరంగా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 65 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్లు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, అనంతరం ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు.

ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు కాగా, అధికారంలోకి ఎవరు వస్తారనే ఉత్కంఠ నెలకొంది. డీఎంకే, ఏఐఏడీఎంకే కూటమి, అలాగే విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కొళత్తూరు నుంచి పోటీ చేస్తుండగా, మాజీ సీఎం పళని స్వామి ఎడప్పాడి నుంచి బరిలో ఉన్నారు. చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీ చేస్తున్నారు. టీవీకే అధినేత విజయ్ పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి, తెంకాసి జిల్లాల్లోని కొన్ని సమస్యాత్మక కేంద్రాలను ఎన్నికల సంఘం గుర్తించి, అక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేసింది.

సర్వేలు హంగ్ ఏర్పడే అవకాశాలను సూచిస్తున్న నేపథ్యంలో, టీవీకే పార్టీ చేపట్టిన క్యాంప్ రాజకీయాలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులను వెంటనే రిసార్ట్‌కు తరలించాలని పార్టీ ఆదేశాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. మొత్తానికి, తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అన్నది ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DMK vs AIADMK
  • election counting Tamil Nadu
  • exit polls Tamil Nadu
  • Mahabalipuram resort politics
  • resort politics India

తాజావార్తలు

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Anirudh : హీరోల స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

  • Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ

  • Raka: అల్లు అర్జున్ ‘రాకా’లో అక్షయ్ కుమార్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

  • Assam Assembly Election Results: హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా.. ఈసారి జలుక్‌బరి స్థానంలో ఎవరు గెలుస్తారు?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions