Raka: అల్లు అర్జున్ ‘రాకా’లో అక్షయ్ కుమార్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లకు అట్లీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. తదుపరి షెడ్యూల్‌లో బన్నీపై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ మరియు సైంటిఫిక్ అంశాలతో ఈ సినిమా ఆడియన్స్‌ను విస్మయానికి గురిచేయబోతోందని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ మూవీ గురించి ఒక క్రేజీ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ ప్రత్యేక పాత్ర కోసం అట్లీ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. వచ్చే షెడ్యూల్ నుంచే అక్షయ్ ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణె మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా, ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా తోడైతే ఈ సినిమా స్థాయి మరో రేంజ్‌కు వెళ్లడం ఖాయం. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకోణెతో పాటు రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్టులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతమంది స్టార్ కాస్టింగ్ ఉండటంతో ‘రాకా’ చిత్రంపై అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!