Site icon NTV Telugu

MK Stalin: దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ అధికారంలోకి రావొద్దు..

Stalin

Stalin

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. పార్టీ అభ్యర్థుల కోసం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. కాగా, తన పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరుతున్నారు. ఇవాళ (మంగళవారం) ఉదయం తూత్తుకుడి జిల్లాలో స్టాలిన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన సోదరి, ఎంపీ కనిమొళితో కలిసి తూత్తుకుడిలోని సీఎం స్టాలిన్ కూరగాయల మార్కెట్‌తో పాటు మత్స్యకారుల కాలనీలో ఆయన ప్రచారం నిర్వహించారు.

Read Also: Hero Nani: హీరో నానిని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్!

ఇక, ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై హాట్ కామెంట్స్‌ చేశారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావొద్దని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలంగా మారుతుందని ఓట్లర్లను ఆయన హెచ్చరించారు. అయితే, నరేంద్ర మోడీని మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమనేది తమిళనాడు ప్రజల చేతుల్లో ఉంది.. బీజేపీ మళ్లీ గెలిస్తే సమాజంలో విష బీజాలు నాటుతదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రచారం సందర్భంగా స్థానికులు సీఎం స్టాలిన్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

Exit mobile version