Bomb Threat Hoax: తమిళనాడులో బాంబు బెదిరింపులు.. సీఎం స్టాలిన్, అజిత్ కుమార్ సహా పలువురు ప్రముఖుల ఇళ్లకు హై అలర్ట్..!
Bomb Threat Hoax: తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ నివాసంతో పాటు, సినీ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసాలకు ఆదివారం రాత్రి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈ-మెయిల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయానికి కూడా రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఈ నాలుగు ప్రాంతాలలోనూ భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని ఇంజాంబాక్కంలో ఉన్న నివాసానికి గత వారం కూడా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చింది. తాజాగా మళ్లీ బెదిరింపు రావడంతో పోలీసులు ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర రీ-ఎంట్రీ..!
Also Read
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్‌బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
బెదిరింపు మెయిల్ అందిన వెంటనే పోలీసు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఆ తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఈ బెదిరింపులన్నీ బూటకం (Hoax) అని అధికారులు ధృవీకరించారు. బెదిరింపు మెయిల్ పంపిన వారి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా గతంలో డీజీపీ కార్యాలయానికి నటుడు అరుణ్ విజయ్ నివాసంలో (ఎక్కట్టుత్తాంగల్) బాంబు పెట్టినట్లు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆ సమాచారం అందిన వెంటనే పోలీసులు, బాంబు డిస్పోజల్ నిపుణులు సోదా చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో ఈ విధమైన సంఘటనల బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతోంది. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపుల వెనుక ఉన్న ఆకతాయిలను లేదా కుట్రదారులను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
SS Rajamouli : ఐ బొమ్మ రవి మీ పర్సనల్ డేటా అమ్ముకుంటున్నాడు.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్‌బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!