Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Assembly: తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార పక్షానికి పలు మిత్రపక్షాలు బహిరంగ మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అదే కారణంగా మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మరో మిత్రపక్షమైన విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. అయితే డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత గట్టిగా పోరాడాలని విజయ్ను కోరింది. అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), అమ్మ మక్కల్ మున్నెట్ట్రా కజగం (AMMK) కూడా మద్దతు ప్రకటించడంతో విజయ్ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందులు లేవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అల్ ఇండియా అన్న ద్రావిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచింది. K. పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా ఓటు వేసింది. దీంతో అసెంబ్లీలో అధికార పక్షం తన బలం మరోసారి నిరూపించుకున్నట్లయింది.
Also Read
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
- Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
తాజావార్తలు
-
Madhuri Rathod : పోలీసుల తీరుపై ఆరోపణలు.. డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!