Site icon NTV Telugu

Tamannaah : ఇంటిమేట్ సీన్ప్ విషయంలో.. స్టార్ హీరో బండారం బయటపెట్టిన తమన్నా.

Tamannah

Tamannah

ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ తన గ్లామర్‌తో మెప్పిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ఒక స్టార్ హీరో తనను అందరి ముందు దారుణంగా తిట్టాడనే విషయం బయటపెట్టింది. షూటింగ్ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపించి‌న ఒక ఇంటిమేట్ సీన్ చేయడానికి ‘నో’ చెప్పడ‌మే ఆమె చేసిన తప్పు. అది నచ్చని ఆ హీరో.. సెట్లోనే అందరి ముందు తమన్నాపై అరుస్తూ, ‘ఈ హీరోయిన్‌ని మార్చేయండి’ అని ప్రొడక్షన్ టీమ్‌కి చెప్పాడట. ఆ సమయంలో చాలా బాధ అనిపించినా, తన హద్దులు తాను దాటకూడదని గట్టిగా నిలబడ్డానని తమన్నా చెప్పుకొచ్చింది.

Also Read : Ram Charan : వారసత్వం ఉన్నా గుర్తింపు రావడానికి టైం పట్టింది – రామ్ చరణ్

అయితే చిత్రమైన విషయం ఏంటంటే.. మరుసటి రోజే ఆ స్టార్ హీరో తన తప్పు తెలుసుకుని తమన్నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడట. ఆ హీరో ఎవరన్నది తమన్నా బయటపెట్టక పోయినప్పటికీ, హీరోయిన్ల మీద ఉండే ఒత్తిడిని ఈ విషయం మరోసారి బయటపెట్టింది. ప్రస్తుతం తమన్నా తెలుగుతో పాటు బాలీవుడ్‌లోను బిజీగా ఉంది. కెరీర్ మొదట్లో ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను ఇప్పుడు ధైర్యంగా చెప్పడం ద్వారా తోటి నటీమణులకు ఆమె ఒక రకమైన స్ఫూర్తినిస్తోంది.. ‘ఎవరైనా మనల్ని అవమానిస్తే అది వారి పద్ధతిని సూచిస్తుంది తప్ప, మనం తలవంచాల్సిన అవసరం లేదు’ అని తమన్నా ఇచ్చిన సందేశం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version