బాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓ రోమియో’. విశాల్ భరద్వాజ్ – షాహిద్ కపూర్ కాంబోలో ‘కమీనే’, ‘హైదర్’ వంటి హిట్ల తర్వాత వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా తో పాటు తృప్తి డిమ్రి, నానా పటేకర్, విక్రాంత్ మాస్సే వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంది. ముంబైకి చెందిన దివంగత గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన కుమార్తె సనోబర్ షేక్ చిత్ర యూనిట్‌కు షాకిచ్చారు.
Also Read : Sreeleela : అసలైన విజయం ఇప్పుడే దక్కింది.. కోలీవుడ్ ఎంట్రీపై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు
తన తండ్రి పాత్రను సినిమాలో తప్పుగా చూపిస్తూ తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ దర్శకుడు విశాల్ భరద్వాజ్, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలాకు లీగల్ నోటీసులు పంపారు. అంతే కాదు తమ అభ్యంతరాలు తీరే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని, లేనిపక్షంలో రూ. 2 కోట్లు పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేయడం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఇక టీజర్‌లో షాహిద్ కపూర్ పవర్‌ఫుల్ గన్‌మెన్‌గా కనిపించడం, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో హుస్సేన్ ఉస్తారాకు ఉన్న వైరాన్ని సినిమాలో చూపిస్తున్నారనే ప్రచారం ఈ వివాదానికి కారణమైంది. మరి ఈ లీగల్ నోటీసులపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో, సినిమా సకాలంలో థియేటర్లకు వస్తుందో లేదో చూడాలి.