తమన్నా భాటియా… మామూలుగానే ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్య తాను చేసిన ఓ డ్యాన్స్‌తో ఈ ముద్దుగుమ్మ మరింత ఫేమస్ అయిపోయింది. ఆ పాట మరేదో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించి ఈ రోజు విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న జైలర్ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్. ఈ పాటను జూలై 6 న చిత్ర యూనిట్ విడుతల చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ పాట రచ్చ రచ్చ చేస్తోనే ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పాటకు స్టెప్పులేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తోన్నారు.
ఈ పాటలో తమన్నా రింగు రింగులా జుట్టుతో ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ పాట స్టెప్పులు కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో విడుదలైన నాటి నుంచే ఈ పాట వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు ఇదే పాటకు ఓ స్కూల్ బాయ్స్ బృందం డ్యాన్స్ చేసింది. బలరామ్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటి వరకు 6 మిలియన్ల మందికి పైగా ఈ పాటను చూశారు.
ఈ వీడియోలో ఓ పిల్లవాడు డ్యాన్స్ చేస్తూ ఉండగా అతనిని చూసి మిగిలిన వారు కూడా ఆ బాలుడిలా స్టెప్పులు వేయడం స్టార్ట్ చేశారు. చూడటానికి సాధారణంగానే ఉన్న ఈ వీడియో నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకర్షిస్తోంది. పిల్లల డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన జైలర్ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముందుగానే విడుదలైన పాటలు, టీజర్ మాదిరిగానే సినిమా కూడా ఆకట్టుకునే విధంగా ఉందని సినిమా చూసిన వారు చెబుతున్నారు.