ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జులై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందారు.
Also Read: Chevireddy Bhaskar Reddy: జైలు వద్ద ఆగని చెవిరెడ్డి హంగామా.. మూల్యం తప్పదు అంటూ..!
ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌కు అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా జులై 10న మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ ఒకటో తరగతిలో 5.5 లక్షలు, ఇంటర్ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు చేరినట్లు తెలుస్తోంది. ఇంకా వారం సమయం ఉంది కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
