ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జులై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందారు.…
ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు.