Site icon NTV Telugu

Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారని ఆర్టీసీ కార్మికులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండో రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా మహాధర్న కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన ఆయన రాణిగంజ్ డిపో వద్ద మాట్లాడారు. ఆ నాడు కేసీఆర్ సకల జనులను ఏకం చేశారు. అందులో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదన్నారు. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చి శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందన్నారు. గతంలో కేసీఆర్ కేబినెట్‌ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుందన్నారు. అంతలోనే ప్రభుత్వం మారిందన్నారు. ఆర్టీసీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని గుర్తు చేశారు. రెండు రోజులుగా ఆర్టీసీ సమ్మే చేస్తుంటే.. ప్రజలు అల్లాడి పోతున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలు వెనుకుండి సమ్మే చేయిస్తున్నారని ఓ మంత్రి అంటున్నారు. అసలు మీరు ఇచ్చిన హామీలు తీరస్తే.. సమ్మే ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. సమ్మె చేసే ఉద్యోగులను ఆర్టీసీ ఎండీ బెదిరిస్తున్నారని.. ముందు నీ ఉద్యోగం ఉంటుందో లేదో చూసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చేది మా ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

READ MORE: Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?

“అందరం కలిసి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్దాం. ప్రభుత్వం మెడలు వంచి హామీలు సాదిద్ధం. పీఆర్‌సీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎలక్ట్రికల్ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నడిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్లకు ఎలక్ట్రికల్ బస్సు నడపడం రాదా? ఆర్టీసీ కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు. మీ వెనుక మా పార్టీ మొత్తం ఉంది. 29 డిమాండ్స్ తీర్చేందుకు సిద్దంగా ఉన్నామని అంటున్నారు. మరి ఆ 29 డిమాండ్స్ ఏంటో మీడియా సాక్షిగా విడుదల చేయాలి. మీ కాబినెట్ తరువాత వెంటనే ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న. హామీల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాలి. తూతు మంత్రంగా ఒప్పుకోవద్దని జేఏసీ సంఘాల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కొట్లాడితే.. మీతో పాటు ముందు వరసలో మేము ఉంటాము..” మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.

Exit mobile version