వీఆర్‌ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రామ సేవకులుగా ఉన్న వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ భరోసా ఇచ్చేలా వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమించడం జరిగిందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్ జిల్లాలో వివిధ శాఖలకు కేటాయిస్తూ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్. మహమూద్ అలీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాకు కేటాయించిన 182 మంది వీఆర్‌ఏలను విద్యార్హతల ఆధారంగా వివిధ కేటగిరీలలో నియమించామని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో APPSC ద్వారా కేవలం నెలకు 3 వేల రూపాయలతో కన్ సాలిడేటెడ్ వేతనంతో నియమించబడిన వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ.. దేశ చరిత్రలో నిలిచిపోతుంది.
Also Read : Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం
ఏ ప్రభుత్వాలు కూడా ఇలా గొప్ప నిర్ణయాలు తీసుకోలేదు. గ్రామంలో ఏ ఇతర శాఖ అధికారి వచ్చినా వీఆర్‌ఏలు అందుబాటులో ఉండేవారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలతో ఇబ్బదులు పడ్డారని గుర్తు చేశారు. వీఆర్‌ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులు. మీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు.
Also Read : Bhola Shankar: భోళాశంకర్ టికెట్ రేట్ల పెంపు వివాదం ఏంటి? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది?
