NTV Telugu Site icon

Bhatti Vikramarka: అడవులు, జలపాతాల వద్ద పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టండి.. అధికారులకు ఆదేశం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

రాష్ట్రంలో అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో పచ్చని, దట్టమైన అడవులు.. జలపాతాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎన్సీసీపై బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సాంస్కృతిక సారధి కళాకారులు గత ఏడు నెలలుగా ఏ విధులు నిర్వహిస్తున్నారని డిప్యూటీ సీఎం ఆరా తీశారు. కళాకారులను సమాజ అభివృద్ధికి పూర్తిగా వాడుకోవడం లేదు.. వారి సేవలు వినియోగించుకునేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో అనేక నిర్మాణాలు ప్రారంభించి మధ్యలో వదిలేసింది.. ఫలితంగా వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగమైంది.. గతంలో ప్రారంభించి 90 శాతం పూర్తి చేసిన భవనాలను గుర్తించి నిర్మాణాలు పూర్తి చేయండి, మిగిలిన భవనాలు దశలవారీగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Train Accident: వీడిన దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో క్రీడా మైదానాలు ఉన్నాయి.. వాటిని నిరుపయోగంగా ఉంచడం మూలంగా ఆక్రమణలు జరుగుతున్నాయి.. అధికారులు వెంటనే స్పందించి.. నిత్యం క్రీడలు నిర్వహించి… మైదానాలను ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యార్థులకు క్రీడా మైదానాల్లో క్రీడలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొన్నిచోట్ల క్రీడా మైదానాలు ఆక్రమణలకు గురైనట్టుగా సమాచారం ఉంది.. వెంటనే ఆ విషయాలపై దృష్టి సారించి ఆక్రమణ దారులను ఖాళీ చేయించండి.. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఏడాది మొత్తంగా ప్రభుత్వ క్రీడా మైదానాల్లో యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. పర్యాటక శాఖ సొంత ఆస్తులు, లీజ్లో ఉన్న ఆస్తుల వివరాలపై ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, అడవులను పర్యాటక సాంస్కృతిక శాఖలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు.

Pawan Kalyan: భార్య గ్రాడ్యుయేషన్.. సింగపూర్‌లో పవన్‌

కల్చర్ అంటే ఆటలు, పాటలు అనుకుంటున్నారు.. కానీ కల్చర్ అంటే జీవన విధానం అని చాలా మందికి తెలియదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళాకారులు ప్రజల జీవన విధానంలో మెరుగైన మార్పులు తెచ్చేందుకు.. తీసుకునే ఆహారం, వేసుకునే దుస్తులు ఇలా అన్ని అంశాల పైన గ్రామీణ ప్రజానీకాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న చెక్ పోస్టులను పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు సమగ్ర ప్రణాళికలు చేయాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. రాష్ట్రంలో సంస్కృతి, వారసత్వ సంపదలు ఘనంగా ఉన్నా.. ఆ మేరకు వాటిని వినియోగించుకుని పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు దృష్టి సారించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు.