NTV Telugu Site icon

Rahul Gandhi : కులగణనకు తెలంగాణనే దేశానికి రోల్‌మోడల్‌ కానుంది

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi : కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు. కానీ సముద్రంలో ఒక మంచు కొండను డీ కొని 20 నిమిషాలలలో మునిగిపోయిందని, ఎందుకు అంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించిందన్నారు రాహుల్‌ గాంధీ. మిగతా అంత లోతుగా ఉండి బయటకు కనిపించింది అది తెలియక ఆ పడవ కుప్ప కూలిందని, అలాగే నేడు సమాజంలో కుల వివక్ష కూడా లోతుగా బలంగా ఉందన్నారు. దేశంలో కుల వివక్ష అనుభవించే వాళ్లకు ఆ బాధ తెలుస్తుందని, మేము దేశంలో కుల వివక్ష అనే వ్యాధి గురించి తెలుసుకునేందుకు పరీక్షలు చేయాలని అనుకుంతున్నామన్నారు రాహుల్ గాంధీ. అందుకే కుల ఘనన అనేది అత్యంత కీలకమని, కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంత మంది ఉన్నారు.. ఎవరు పేదలు, ఎవరికి ఏముంది అని తెలుసుకోవాలన్నారు. ఏదైనా వ్యాధి తెలియాలంటే ఏక్షరే చేయాలి కదా అని ఆయన వ్యాఖ్యానించారు. మేము కుల ఘనన చేస్తం ఎవరికి ఏముందో తెలుసుకుందాం అంటే ప్రధాని.మోడీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారని, మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారని ఆయన అన్నారు.

Ponguleti Srinivas Reddy : వరంగల్‌ వాసులకు శుభవార్త.. ఇది మామూలు ముచ్చట కాదు..!

అంతేకాకుండా..’దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా.. మేము దేశవ్యాప్తంగా కుల ఘనన చేసి వారి జనాభా తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించాము. తెలంగాణ లో కుల ఘనన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. తెలంగాణ కుల ఘనన చేపట్టడానికి ప్రశ్నలు అధికారులు తయారు చేయవద్దు. ప్రజల నుంచి వారి ఆలోచినలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలి. తెలంగాణ కుల ఘాననదేశానికి ఆదర్శంగా నిలుస్తుంది . దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.. ప్రపంచంలో మన దేశంలో కుల వివక్ష ఉందని సర్వేల్లో చెప్పారు.. వివక్ష తొలగించి అందరికి అందరికి సమానంగా జాతి సంపద అందించేందుకు కృషి చేస్తాం.. కుల వివక్షతపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడు. కార్పొరేట్ సంస్థలలో ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ ఎస్టీలు, బీసీలు పనిచేస్తున్నారు.

అదివాసీలు మీడియా రంగంలో ఎంత మంది ఉన్నారు. ఈ ప్రశ్నలను నేను పదేపదే మోడీని అడిగితే నేను దేశాన్ని విడగొట్టినట్టు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కులగణన వలన దేశంలో ఒక మంచి పరిపాలన అందించడానికి అవకాశం ఉంది. ఈ భూ మండలం మీద ఎక్కువ కుల అసమానతలు ఉన్న దేశం భారతదేశం. అసమానతుల గురించి ప్రపంచంలోనే ఒక ఆర్థిక నిపునిడితో మాట్లాడిన. అసమానతలకు భారతదేశం కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ విషయంపై ఆర్థిక నిపుణుడిని పలు ప్రశ్నలు అడిగాను. దేశంలో నెలకొన్న అసమానతలకు ప్రధాన కారణం కుల వివక్ష. ఈ దేశంలో ఇంకా ఒక దళితుడిని అంటరానివాడిగా చూస్తూ ముట్టుకునే పరిస్థితి లేదు. ఈ రకమైన వర్గ వివక్ష ప్రపంచంలో ఎక్కడా లేదు.’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Nara Brahmani: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా బ్రాహ్మణి