NTV Telugu Site icon

Bandi Sanjay : నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను

Bandi Sanjay Group1

Bandi Sanjay Group1

Bandi Sanjay : నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ కరీంనగర్‌లో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలే అని ఆయన వ్యాఖ్యానించారు.

Kakinada: కుడా ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి.. కుప్పకూలిన స్టేజ్

కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయని, పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు బండి సంజయ్‌. బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారని, హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నా అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Instagram Love : యువతి కొంపముంచిన ఇన్ స్టాగ్రామ్ పరిచయం

Show comments