NTV Telugu Site icon

Jeevan Reddy : ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది

Jeevan

Jeevan

Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని, కాంగ్రెస్ మాత్రం సామాజిక తెలంగాణ దృక్పథంతో ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో ఉందని, తెలంగాణ తల్లి చేయి హస్తం గుర్తును చూపిస్తుందని బీఆర్‌ఎస్‌ వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు.

Sridhar Babu: మీ సేవ మొబైల్ యాప్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు..

తెలంగాణ తల్లి రవిక ఆరెంజ్, చీర ఆకుపచ్చ కలర్ ఉంది అంటే బీజేపీకి సంకేతంగా సూచిస్తుందా? ఇట్లా ఆలోచిస్తే ఎట్లా? అని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని.. కాంగ్రెస్ మాత్రం సామాజిక తెలంగాణ దృక్పథంతో ముందుకు సాగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందని.. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు జీవన్ రెడ్డి.

CM Revanth Reddy: నా ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నా.. సీఎం రేవంత్ ట్వీట్‌..