NTV Telugu Site icon

Paris Olympics: ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తెలుగమ్మాయి..

Olampics

Olampics

మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 4-2తో జియాన్ జెంగ్‌పై గెలిచి ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 51 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆకుల 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 తేడాతో విజయం సాధించాది. దీంతో టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో ఒలింపిక్స్‌లో చివరి-16 రౌండ్‌కు చేరిన రెండో మహిళా క్రీడాకారిణిగా శ్రీజ నిలిచింది. అయితే.. ఈ క్రీడాకారిణి కంటే ముందు నిన్న మనికా బాత్రా కూడా 16వ రౌండ్ కు అర్హత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచింది. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజది ఈరోజు పుట్టిన రోజు. బర్త్ డే రోజున ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది. కాగా.. 1998 జూలై 31న హైదరాబాద్ లో జన్మించింది ఈ యువ సంచలనం.

Read Also: Malvi: లావణ్య క్రిమినల్.. వాళ్ళతో చేతులు కలిపింది.. మాల్వి సంచలనం

మరోవైపు.. భారత మహిళా బాక్సర్ లోవ్లినా మహిళల 75 కేజీల విభాగంలో బోర్గోహైన్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి.. క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో ఏకగ్రీవంగా గెలిచింది. అలాగే.. భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ 21-18, 21-12తో ఇండోనేషియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ జోనాథన్ క్రిస్టీపై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ విజయంతో లక్ష్యసేన్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు.

Read Also: Olympics: “ముద్దు” వివాదంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు.. క్రీడా మంత్రి, మక్రాన్ కిస్‌పై రగడ..