Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports T20 World Cup Trophy Made In Jaipur Amit Pabuwal Story

ICC T20 World Cup Trophy: గెలిచిన జట్టుకు ఇచ్చే కప్పు ఒరిజినల్ కాదా? వరల్డ్ కప్ ట్రోఫీ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

Published Date :March 8, 2026 , 2:51 pm
By RAMAKRISHNA KENCHE
ICC T20 World Cup Trophy: గెలిచిన జట్టుకు ఇచ్చే కప్పు ఒరిజినల్ కాదా? వరల్డ్ కప్ ట్రోఫీ వెనుక ఉన్న అసలు కథ ఇదే!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ICC T20 World Cup Trophy: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా కప్పు గెలవాలని ఇరు జట్లు తాపత్రయపడుతున్నాయి. అయితే.. ఇంతకీ ఈ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఎక్కడ తయారైందో తెలుసా? ఈ ట్రోఫీ రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూపుదిద్దుకుంది. జైపూర్‌కు చెందిన ట్రోఫీ రూపకర్త అమిత్ పబువాల్ (Amit Pabuwal) ఈ ట్రోఫీని తయారు చేశారు. మొదట ఈ ట్రోఫీకి సంబంధించిన రూపకల్పన ఆలోచనను ఆస్ట్రేలియాకు చెందిన Minale Bryce రూపొందించారు. ఆ రూపకల్పన ఆధారంగా తుది ట్రోఫీని తయారు చేసే బాధ్యతను అంతర్జాతీయ క్రికెట్ మండలి అయిన ఐసీసీ అమిత్ పాబువాల్‌కు అప్పగించింది.

READ MORE: IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

Also Read

  • VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
  • India-Pakistan: "పాకిస్తాన్‌తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
Add as a preferred
source on google

ఇక టీ20 వరల్డ్ కప్ 2007లో మొదటి సారి ప్రారంభమైంది. అదే సమయంలో ఈ ట్రోఫీ రూపకల్పన సైతం పూర్తయింది. రూపరేఖలు ఖరారైన తర్వాత ట్రోఫీ తయారీ పనిని తనకు అప్పగించారని అమిత్ పాబువాల్ తెలిపారు. అలా ప్రపంచ క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ట్రోఫీ జైపూర్‌లో రూపుదిద్దుకుంది. అయితే ఈ ట్రోఫీ తయారీ అంత సులభంగా జరగలేదు. మొదట ఈ ట్రోఫీని టైటానియం అనే లోహం, గాజు కలయికతో తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లు త్వరగా ఫినిష్ అవుతాయి కాబట్టి.. 20 ఓవర్ల ఆట శైలిని ప్రతిబింబించేలా ఆధునిక రూపంలో ఉండాలని ఆలోచించారు. అందుకోసం అనేక నమూనాలు కూడా తయారు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. గాజును లోహంతో కలిపే సమయంలో అది పదే పదే విరిగిపోయింది. సాంకేతికంగా ఈ సేఫ్ రావడం కష్టంగా మారిందని అమిత్ పాబువాల్ గుర్తించారు. దాంతో చివరకు ట్రోఫీని వెండి లోహంతో తయారు చేసి, పైభాగానికి ప్లాటినం పూత వేయాలని నిర్ణయించారు. ఈ విధంగా తయారు చేసిన ట్రోఫీ బలంగా ఉండటంతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీకి తగిన గౌరవాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ ట్రోఫీకి మరో ప్రత్యేకత సైతం ఉంది. అసలు ట్రోఫీ అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రధాన కార్యాలయంలోనే భద్రపరిచి ఉంచుతారు. పోటీలో గెలిచిన జట్టుకు అదే రూపంలో తయారు చేసిన మరో డమ్మీ ట్రోఫీని ఇస్తారు. ఈ ట్రోఫీ సుమారు ఇరవై ఒక అంగుళాల ఎత్తు ఉంటుంది. దాదాపు ఆరు కిలోల బరువు ఉంటుంది. వెండితో తయారు చేసి పైభాగానికి ప్లాటినం పూత వేయడం వల్ల ఇది మెరిసిపోతూ ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అత్యంత గౌరవప్రదమైన గుర్తుగా నిలుస్తుంది.

READ MORE: IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Pabuwal Jaipur
  • Cricket World Cup Trophy Facts
  • ICC T20 World Cup Trophy
  • ICC Trophy Designer
  • ICC Trophy History

తాజావార్తలు

  • Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!

  • VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..

  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్

  • India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions