T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు నామినేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 WC 2026 Final: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ పైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు.
READ ALSO: UPSC CSE 2025 Final Result: UPSC ఫలితాలు విడుదల.. అనుజ్ అగ్రిహోత్రికి ఫస్ట్ ర్యాంక్..
Also Read
- IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
టోర్నీ ఆరంభంలో తుది జట్టులో అవకాశం లేకపోయినా, ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న సంజూ, కేవలం 4 మ్యాచుల్లోనే 232 పరుగులు చేసి టీమిండియాకు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ముఖ్యంగా సూపర్-8, సెమీఫైనల్ మ్యాచుల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రేసులో సంజూతో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు కూడా గట్టి పోటీనిస్తున్నారు. వారిలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ 226 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి నాలుగు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకోగా, పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ 383 పరుగులతో (రెండు సెంచరీలు) ఈ ఎడిషన్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా నుంచి లుంగీ ఎన్గిడి తన పొదుపైన బౌలింగ్‌తో 12 వికెట్లు పడగొట్టగా, ఐడెన్ మార్క్రామ్ 286 పరుగులతో టాప్ ఆర్డర్‌లో నిలకడగా రాణించాడు. న్యూజిలాండ్ ఫైనల్ చేరడంలో రచిన్ రవీంద్ర (11 వికెట్లు, 128 పరుగులు), టిమ్ సైఫర్ట్ (274 పరుగులు) ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఈ టోర్నీలో అసలైన సంచలనం అమెరికా బౌలర్ శాడ్లీ వాన్ షాక్విక్, అతను కేవలం 4 మ్యాచుల్లోనే 13 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో ఉన్నవాళ్లకు అభిమానులు ఓటింగ్ ద్వారా తమకు నచ్చిన ఆటగాడిని ఎంచుకొని విజేతగా నిలపవచ్చు.
READ ALSO: Bhogi :‘భోగి’ నుండి శర్వానంద్ మాస్ విశ్వరూపం..స్పెషల్ పోస్టర్ వైరల్!
తాజావార్తలు
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!