T20 World Cup 2026: “ప్లీజ్ భారత్‌తో మ్యాచ్ ఆడండి”.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక రిక్వెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతోంది. కానీ ఇప్పటి వరకు పాకిస్థాన్ వైఖరి మార్చుకోలేదు. ఇండియాతో ఆడమని తేల్చి చెప్పేస్తున్నారు. పాకిస్థాన్ భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తుందని చెప్పడంతో టీ20 వరల్డ్ కప్‌లో పెద్ద గందరగోళం మొదలైంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు.. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు ఉత్కంఠ భరితమైన క్షణాలు.. ఈ ఉత్కంఠే భారీ ఆదాయంగా మారుతుంది. కానీ ఇప్పుడు పాకిస్థాన్ ఆడదని చెప్పడంతో సమస్యలు పెరిగాయి. ఈ నిర్ణయానికి అసలైన కారణం బంగ్లాదేశ్. భారత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్ టీం నిరాకరించింది. దాంతో ఐసీసీ వారి ప్లేస్‌లో స్కాట్లాండ్‌ను తీసుకుంది. దీనికి మద్దతుగా పాకిస్థాన్ ప్రభుత్వం తమ జట్టుకు భారత్‌తో ఆడవద్దని ఆదేశాలు ఇచ్చింది.
READ MORE: Gold-Silver Rates: గుడ్‌న్యూస్… భారీగా దిగొచ్చిన వెండి, బంగారం ధరలు
Also Read
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
- Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
అయితే..ఈ నిర్ణయం వల్ల శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) బాధపడుతోంది. ఈ మ్యాచ్ వల్ల టికెట్లు, ప్రసార హక్కులు, ఇతర ఆదాయాలు భారీగా వస్తాయని శ్రీలంక ఆశించింది. కొలంబోలో హోటళ్లు, ఫ్లైట్లు అన్నీ ఫుల్‌గా బుక్ అయ్యాయి. మ్యాచ్ రద్దైతే ఈ ఆదాయం తగ్గుతుంది. టూరిజం కూడా దెబ్బతింటుంది. హోటల్ బుకింగ్‌లు, ఫ్లైట్లు, ఇతర సరఫరాదారులకు ఇబ్బందులు వస్తాయి. దీంతో ఎస్ఎల్సీ ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) లేఖ రాసింది. గత 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై దాడి జరిగినప్పుడు ఎవరూ పాకిస్థాన్‌కు రాలేదు. అప్పుడు శ్రీలంక మాత్రం వెళ్లి ఆడింది. ఇప్పుడు అదే మద్దతు ఆశిస్తున్నామని లేఖలో పేర్కొంది. మ్యాచ్ ఆడండి, ఇది అందరి ప్రయోజనాలకు మంచిదని విజ్ఞప్తి చేసింది. ఈ లేఖ గురువారం పంపారు.
READ MORE: Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’
మరోవైపు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టంగా చెప్పారు. మేము ఆడటానికి సిద్ధంగా ఉన్నాము. మా ఫ్లైట్ బుక్ అయింది.. కొలంబోకు వెళ్తాం. వాళ్ల నిర్ణయం మా చేతుల్లో లేదన్నారు. గతంలో ఆసియా కప్‌లో న్యూట్రల్ వేదికల్లో ఆడామని టీమిండియా తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ తన వైఖరిని తెలియజేయాల్సి ఉంది. ఒక వేళ మ్యాచ్‌ను రద్దు చేస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది క్రికెట్‌కు, శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు, అభిమానులకు పెద్ద దెబ్బగా మారుతుంది. ఇప్పుడు పీసీబీ ఈ నిర్ణయాన్ని మారుస్తుందా లేదా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..