Ind vs WI: ఇదే జరిగితే మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు వెస్టిండీస్.. కెప్టెన్ సూర్య తప్పు వల్ల భారత్ ఇంటికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies: భారత్‌కు నేడు చాలా కీలక మైన రోజు. వెస్టిండీస్‌తో పోరులో టీమిండియా గెలిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు ఇప్పటికే రెండు జట్లు ప్రీపేర్ అయ్యాయి. ఇరు జట్లపై చాలా ఒత్తిడి ఉండనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్-4లోకి దూసుకెళ్తుంది. అందుకే ఈ మ్యాచ్‌ను వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌గా భావిస్తున్నారు. రెండు జట్లు రెండేసి మ్యాచ్‌ల్లో ఒక్కో విజయం సాధించి 2 పాయింట్లతో ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ (NRR) పరంగా వెస్టిండీస్ కొంచెం ముందంజలో ఉంది. భారత్‌కు సౌతాఫ్రికాతో జరిగిన ఓటమి పెద్ద షాక్ ఇచ్చింది. అయితే జింబాబ్వేపై గెలిచి జట్టు మళ్లీ రేసులోకి వచ్చింది. మరోవైపు వెస్టిండీస్ సూపర్ 8లో జింబాబ్వేపై విజయం సాధించి బలంగా ఆరంభించినా, సౌతాఫ్రికా చేతిలో ఎదురైన భారీ ఓటమి వారికి గట్టి దెబ్బ వేసింది.
READ MORE: Israel-Iran War: ఇరాన్ టాప్-లీడర్‌షిప్ ఖతం.. ఖమేనీ సహా 40 మంది కమాండర్లు హతం..
Also Read
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
ఒక వేళ వర్ష వల్ల మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అందరిలో వచ్చే ఉంటుంది. అలా జరిగితే మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా వెస్టిండీస్ సెమీఫైనల్‌కు వెళ్లిపోతుంది. భారత్ మాత్రం టోర్నమెంట్‌కు గుడ్‌బై చెప్పాల్సి వస్తుంది. ఇందుకు కెప్టెన్ సూర్యకుమార్ చేసిన ఒక తప్పిదమే బలమైన కారణంగా మారుతుంది. ఎందుకంటే.. గత జింబాబ్వే మ్యాచ్‌లో బుమ్రా, పాండ్యాలను సూర్య సరిగ్గా వినియోగించుకోలేదు. బదులుగా శివమ్ దూబేకు రెండు ఓవర్లు ఇచ్చారు. ఆ ఓవర్లలో 46 పరుగులు వచ్చాయి. ఇక్కడే పెద్ద దెబ్బ పడింది. ఒకవేళ భారత్ జింబాబ్వే మ్యాచ్‌లో 108 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలిచుంటే, నెట్ రన్‌రేట్ వెస్టిండీస్ కంటే మెరుగ్గా ఉండేది. అప్పుడు వర్షం పడినా నిశ్చింతగా ఉండేది. ఇక్కడ కెప్టెన్ చేసిన తప్పుకు మూల్యం తప్పదు! కాబట్టి టీమ్ ఇండియా కోసం ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్ అని చెప్పాలి. వర్షం పడొద్దనే మనం ప్రార్థించాల్సి ఉంటుంది. ఇప్పుడు సూర్యకుమార్ జట్టు అంచనాలను పరిశీలిద్దాం.. భారత్ స్క్వాడ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్ వంటి దూకుడైన బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు బలంగా మారనున్నారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు జట్టుకు చేయూత అందిస్తే విజయం మనదే. మరోవైపు.. వెస్టిండీస్ జట్టులో బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ వంటి మ్యాచ్‌ను ఒక్కసారిగా తారుమారు చేసే హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లో షమార్ జోసెఫ్, జేడెన్ సీల్స్, అకీల్ హొసేన్ వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించగలరు. మొత్తనికి నేడు జరిగే మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా మారనుంది.
తాజావార్తలు
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!