2026 T20 World Cup: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి 8న ఫైనల్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో పాల్గొననున్న జట్లను ఐదు టీంల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. భారతదేశం, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లలకు ఫిబ్రవరి 15న తలపడతాయి. అయితే ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫైనల్‌లో ఏ జట్లు తలపడతాయో జోస్యం చెప్పారు.
READ ALSO: Realme Watch 5: త్వరలో భారత మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్ వాచ్..
ఫైనల్ గురించి సూర్య అంచనా..
2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల చేయడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయనను కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న జతిన్ సప్రు
ఫైనల్ మ్యాచ్ గురించి అడిగాడు.. దానికి సూర్య స్పందిస్తూ.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని, ఫైనల్‌లో టీమిండియా – ఆస్ట్రేలియాతో తలపడుతుందని చెప్పారు. సూర్య మాటలతో అక్కడే ఉన్న టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మద్దతు ఇచ్చింది. ఈ ప్రపంచ కప్‌లో భారతదేశం మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 7న భారతదేశం – అమెరికా మధ్య జరుగనుంది. భారతదేశం రెండవ మ్యాచ్ ఫిబ్రవరి 12న నమీబియాతో ఉంది. మూడవ మ్యాచ్ ఫిబ్రవరి 15న భారతదేశం – పాకిస్థాన్ మధ్య జరుగనుంది. ఫిబ్రవరి 18న భారతదేశం నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ దశ మ్యాచ్‌ను ఆడుతుంది.
ఏ గ్రూపులో ఎవరు ఉన్నారు అంటే..
గ్రూప్ ఎ – ఇండియా, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
గ్రూప్ బి – ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్
గ్రూప్ సి – ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్
గ్రూప్ డి – న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 జట్లు ఇవే..
భారతదేశం, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, USA, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, UAE.
READ ALSO: Rohit Sharma: నయా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. T20 ప్రపంచ కప్‌లో సరి కొత్త ప్రయాణం !