ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో ఈసారి సరికొత్త రూల్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2024: రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కాబోతుంది. 2007లో మొదలైన ఈ మినీ వరల్డ్ కప్ ఇప్పటికే 8 ఎడిషన్స్ పూర్తి చేసుకుని 9వ సీజన్‌లోకి సక్సెస్ ఫుల్ గా అడుగు పెడుతుంది. గత 8 ఎడిషన్లలో ఐసీసీ ఈ మోడల్‌లో అనేక కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఈసారి కూడా మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.
Read Also:SEBI: సెబీ యాక్షన్ మోడ్.. ముగ్గురిపై రూ. 2.5 కోట్ల వరకు జరిమానా
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కాగా, స్టాప్ క్లాక్ రూల్ ప్రయోగాత్మకంగా విజయవంతం కావడంతో ఈ వరల్డ్ కప్ నుంచి వైట్ బాల్ ఫార్మాట్‌లో ఈ నిబంధనను ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ స్టాప్ క్లాక్ నియమం ప్రకారం.. రెండు ఓవర్ల మధ్య, ఒక టీమ్ తర్వాతి ఓవర్ స్టార్ట్ చేసేందుకు 60 సెకన్ల సమయం ఇవ్వనుంది. ఈ టైంలోపూ బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్‌ను స్టార్ట్ చేయాలి.. ఒక ఓవర్ ముగిసిన వెంటనే, థర్డ్ అంపైర్ ఈ రూల్ను అమలు చేస్తాడు. ఈ గడువులోపు ఓవర్ స్టార్ట్ చేయకపోతే, ఆన్-ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ జట్టుకు రెండుసార్లు వార్నింగ్ ఇస్తాడు.. మూడవ హెచ్చరికపై ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తాడు. ఈ రన్స్ బ్యాటింగ్ జట్టు ఖాతాలో పడతాయి.
Read Also: Loksabha Elections 2024 : హిమాచల్‌లో సుఖూ ప్రభుత్వ భవిష్యత్ నిర్ణయించనున్న ఉప ఎన్నికలు
ఇక, ఐసీసీ డిసెంబర్ 2023 నుంచి వైట్ బాల్ ఫార్మాట్‌లో స్టాప్ క్లాక్ నిబంధనను అమలు చేస్తుంది. ఈ రూల్ మ్యాచ్ సమయంలో 20 నిమిషాల టైంని ఆదా చేస్తుంది. ఇది సక్సెస్ కావడంతో టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. అయితే, నిజానికి మ్యాచ్ టైంలో కొన్ని సందర్భాల్లో ఈ రూల్ ను ఉపయోగించరు. ఈ నిబంధనను ఉపయోగించాలా వద్దా అనేది పూర్తిగా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. క్రిజ్‌లోకి కొత్త బ్యాట్స్‌మెన్ వచ్చినప్పుడు, డ్రింక్స్ టైంలో, బ్యాట్స్‌మన్ లేదా ఫీల్డర్‌కు గాయం అయినప్పుడు లేదా ఫీల్డింగ్ జట్టు సమయం కోల్పోకుండా ఉంటే ఈ నియమం పరిగణనలోకి తీసుకోబడదు అని ఐసీసీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!