NTV Telugu Site icon

T20 World Cup 2024: రాహుల్ ద్రవిడ్ రాజకీయం.. రుతురాజ్ గైక్వాడ్‌కు అన్యాయం!

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Netizens Slams Rahul Dravid Over Ruturaj Gaikwad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. స్టాండ్‌బైగా నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. మే 15 లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి గురై ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఐపీఎల్ 17వ సీజన్‌లో అదరగొడుతున్న సంజూ శాంసన్‌లను వికెట్ కీపర్‌లుగా ఎంపిక చేసింది. ఐపీఎల్ 2024లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్‌ శివమ్ దూబేకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు.

అయితే జట్టులో కచ్చితంగా ఉంటారనుకున్న కేఎల్ రాహుల్‌, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లకు నిరాశే ఎదురైంది. గిల్, రింకూలు స్టాండ్ బై లిస్ట్‌లో ఉండగా.. రాహుల్‌ను మాత్రం సెలెక్టర్లు పరిగణలోకి కూడా తీసుకోలేదు. బీసీసీఐ ప్రకటించిన జట్టు‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతేడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న రింకూ, రుతురాజ్ గైక్వాడ్‌లను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్ ఎంపిక కాకపోవడానికి కారణం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడే అని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.

Also Read: T20 World Cup 2024: రింకూ సింగ్‌కు అవకాశం రాకపోవడానికి కారణం అతడే?

అండర్ 19 ప్రపంచకప్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సమయంలోనూ రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయకుండా రాహుల్ ద్రవిడ్ పక్కనపెట్టాడని, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేయకుండా అన్యాయం చేశాడని నెటిజన్స్ అంటున్నారు. ఐపీఎల్ 2024 ఆదారంగా శివమ్ దూబేను ఎంపిక చేస్తే.. గైక్వాడ్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ద్రవిడ్ రాజకీయం చేశాడని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024లో రుతురాజ్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో 63.85 సగటు, 149.49 స్ట్రైక్ రేట్‌తో 447 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.

Show comments