T20 World Cup: ఫైనల్‌కు చేరేదెవరు?.. నేడు పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి ఆసన్నమైంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగియగా.. ఇక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొంటోంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌దే పైచేయి అనడంలో తప్పు లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్‌లపై గెలిచి కఠినమైన గ్రూప్-1 టాపర్‌గా ఆ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టగా.. కానీ పాక్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. సూపర్-12లో భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన పాక్.. దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌పై ఓడిపోవడంతో అనూహ్యంగా సెమీస్‌కు చేరింది. అదృష్టం కలిసొచ్చిన పాకిస్తాన్ జట్టుతో నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ నేడు జరిగే తొలి సెమీఫైనల్లో తలపడనుంది. ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ గెలుస్తుందా.. అదృష్టం కలిసొచ్చి సెమీస్ చేరిన పాక్ విజయం సాధిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.
ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఓడిపోలేదు. ఇదిలా ఉండగా.. ప్రపంచకప్ పెద్ద మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ తడబాటు తెలియనిది కాదు. గత నాలుగు ప్రపంచకప్పుల్లోనూ సెమీఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఈ సారి ఎలాగైనా కప్పుకొట్టాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ జట్టు ఉంది. బలంగా లేని పాక్ బ్యాటింగ్ లైనప్‌ను త్వరగా దెబ్బతీయాలనే యోచనలో ఉంది కివీస్. ఈ సారి పాక్ విజయం అంత సులభం కాదేమో. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో పాక్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్ విజయమే లక్ష్యంగా టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో బరిలోకి దిగుతోంది. పడుతూ లేస్తూ వచ్చిన బాబర్ ఆజమ్ బృందం ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సర్వశక్తులు ఒడ్డితేనే ముందడుగు వేస్తుంది. లేదంటే గత ఏడాది మాదిరిగానే ఈసారీ సెమీఫైనల్లో నిష్క్రమించాల్సి వస్తుంది. చివరిసారి 2009 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి విజేతగా నిలిచిన పాక్ ఆ తర్వాత ఫైనల్ చేరలేకపోయింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఇప్పటికీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్నాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. బ్యాటింగ్‌లో మూల స్తంభాలైన ఈ ఇద్దరి ఫామ్ పాక్‌కు ఆందోళన కలిగిస్తోంది.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Justice Chandrachud: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం
ఈ టీ20 ప్రపంచకప్ మొదటి నుంచి కూడా మంచి ఊపుమీదున్న న్యూజిలాండ్ నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధిస్తూ సెమీస్ చేరింది. ఒక్క ఇంగ్లండ్ మ్యాచ్‌లో మినహా ప్రతి మ్యాచ్‌లోనూ పెద్ద తేడాతోనే భారీ విజయాలను నమోదు చేసింది. ఆతిథ్య ఆసీస్‌నైతే 89 పరుగులతో ఓడించడం గమనార్హం. టాపార్డర్‌లో ఓపెనర్లు అలెన్, డెవాన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ సహా నాలుగో వరుసలో గ్లెన్ ఫిలిప్స్ రాణిస్తున్నారు. ముఖ్యంగా లంకతో జరిగిన పోరులో టాపార్డర్ మూకుమ్మడిగా విఫలమైనా… ఫిలిప్స్ ఒంటిచేతితో సెంచరీని బాది విజయాన్ని ఖాయం చేశాడు. బౌలింగ్‌లో బౌల్ట్, సౌతీ, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, సోధి ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ముచ్చెటమలు పట్టిస్తున్నారు. ఇంత పటిష్టంగా ఉన్న కివీస్ జట్టుపై పాక్ గెలవడం కష్టమేనని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
జట్లు (అంచనా)
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, డెవాన్ కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాన్‌ట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, సోధి, ఫెర్గూసన్.
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్ ఖాన్, వసీమ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!