Site icon NTV Telugu

Telangana congress : టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శన

Congress

Congress

రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఖమ్మం పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటలకు భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. మయూరి సెంటర్ పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ శంఖారావం పూరించనుంది. టీఎస్పీఎస్సీ, 10వ తరగతి పేపర్ లీక్ లు, ఉద్యోగ నియామకాల్లో నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజ్ రియంబర్స్‌మెంట్‌లో జాప్యం తదితర అంశాలపై పోరుబాట చేపట్టనున్నారు.

Also Read : Software Engineer : ఛీ దీనమ్మ జీవితం.. ఏడాదికి రూ.58లక్షల జీతం.. అయిన ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు

ఈ నిరసన ప్రదర్శనలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు జాతీయ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. విద్యార్థి, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుద్యోగులు భారీగా తరలి రావాలని ఈ నేపథ్యంలో టీపీసీసీ పిలుపునిచ్చింది. కేసీఆర్ విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దాం.. రండి. తరలిరండి అని ఆయన టీపీసీసీ పేర్కొంది.

Also Read: Balineni Srinivasa Reddy : అందులో పెట్టుబడులు నేను పెట్టలేదు.. నిరూపిస్తే నా ఆస్తి రాసిస్తా

Exit mobile version