Site icon NTV Telugu

Sambarala Etigattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..

Syg

Syg

Sambarala Etigattu: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా, రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “SYG” (సంబరాల ఏటిగట్టు). ‘హనుమాన్’ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ ఒక కీలకమైన, పవర్‌ఫుల్ రోల్‌ చేస్తున్నారు. ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన ‘బ్రిటిషు’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన లుక్ అదిరిపోయింది.

READ ALSO: Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన

ఒంటిపై ఉన్న ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే మొండి ధైర్యం గల సైనికుడిగా శ్రీకాంత్ లుక్ చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్ సంచలనం సృష్టించగా, ఇప్పుడు శ్రీకాంత్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా కోసం టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తుంది. ఈ చిత్రానికి బి.అజనీష్ లోకనాథ్ (కాంతార ఫేమ్) సంగీతం అందిస్తుండగా, వెట్రివేల్ పళనిసామి సినిమాటోగ్రఫీ, నవీన్ విజయకృష్ణ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం, ఈ ఏడాది టాలీవుడ్‌లో వస్తున్న బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

READ ALSO: Kangana Ranaut: ప్రధాని మోడీతో కంగనా రనౌత్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో కలిసి వెళ్లిన బాలీవుడ్ క్వీన్!

Exit mobile version