భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొహియుద్దీన్ అరెస్టుపై కుటుంబ సభ్యులు స్పందించారు. మొహియుద్దీన్ సోదరుడు ఒమర్ ఫారూఖీ ఎన్టీవీతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాడు. తన సోదరుడు మంచోడని, ఎవరో కావాలనే కుట్రలో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన బ్రదర్ ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు తెలియదని చెప్పాడు. ఒకవేళ తమ సోదరుడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించండని ఒమర్ ఫారూఖీ అంటున్నాడు.
చార్మినార్‌లోని రెహమానియా మదర్సాలో మౌలనాగా పనిచేస్తున్న ఒమర్ ఫారూఖీ మాట్లాడుతూ… ‘మా సోదరుడు మొహియుద్దీన్ ఎవరో ట్రాప్ చేసి ఈ కుట్రలో ఇరికించారు. మా బ్రదర్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్లు మాకు తెలియదు. నవంబర్ 5న బిజినెస్ డీల్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి గుజరాత్ బయల్దేరాడు. 9వ తేదీన ఏటీఎస్ వారు నాకు ఫోన్ చేసి మీ బ్రదర్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, అరెస్ట్ చేశాం అని చెప్పారు. మొహియుద్దీన్ నివాసాన్ని ముట్టొద్దు, 2 రోజుల్లో వచ్చి ఆయన రూమ్‌లో ఉన్న సామగ్రి స్వాధీనం చేసుకుంటాం అని ఏటీఎస్ పోలీస్ చెప్పారు. ఇంటికి ఏటీఎస్ పోలీసులు వచ్చారు, సామాన్లు సీజ్ చేసి తీసుకువెళ్లారు. ఏటీఎస్ అరెస్టు చేసినవారిలో మరో ఇద్దరు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహైల్ వారితో మాకు ఎలాంటి లింక్స్ లేవు’ అని అన్నాడు.
Also Read: Rohit-Kohli: వన్డేల్లో కొనసాగాలంటే.. రో-కోకు బీసీసీఐ వార్నింగ్!
‘మొహియుద్దీన్ ఆముదం గింజల నుంచి రెసిన్ విషం తయారు చేసినట్లు నిఘా వర్గాల అనుమానం. అందులో వాస్తవం ఏంటో మాకు తెలియదు. ఈ విషాన్ని మంచినీటి వ్యవస్థ, దేవాలయ ప్రసాద నీటిలో కలపాలని కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ హ్యాండ్లర్ అబూ ఖదీజా నుంచి టెలిగ్రాంలో ఆదేశాలు అందినట్లు ఏటీఎస్ వారు కనుగొన్నట్లుగా తెలుస్తుంది. మొహియుద్దీన్ ఫోన్లో లొకేషన్ ఆఫ్ చేసి, చాటింగ్ టెలిగ్రామ్ ద్వారా మాత్రమే ఇదంతా చేశాడా అన్నది మాకు తెలియదు. ఇంట్లోనే రెసిన్ తయారీ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు ఏటీఎస్ పోలీస్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మొయినుద్దీన్ తిరిగిన మార్గాలపై పోలీస్ ఫోకస్ పెట్టారేమో. కేంద్ర ప్రభుత్వం పూర్తి విచారణ జరపాలి. మొహియుద్దీన్ 2007–2013 మధ్య చైనాలో మెడిసిన్ చదివాడు. 2021లో వివాహం అయింది. కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేశాడు. రాజేంద్రనగర్ అసద్ మంజిల్, పోర్ట్‌వ్యూ కాలనీలో నివాసం ఉంటున్నాం. మా స్వస్థలం ఖమ్మం. 20 ఏళ్లుగా కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. నేను చార్మినార్ రెహమానియా మదర్సాలో మౌలానాగా పనిచేస్తున్నా. ఏ మతం కూడా తీవ్రవాదంను ప్రోత్సహించాలని అనుకోదు. ఉగ్రవాదం, ఉగ్రవాదుల దాడులకు మా మతం వ్యతిరేకం. ఒకవేళ మా సోదరుడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించండి’ అని ఒమర్ ఫారూఖీ చెప్పాడు.