Sydney Terror Attack: సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు11 మంది మరణించగా, ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిగా భావిస్తున్న వ్యక్తి మరణించగా, రెండవ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సిడ్నీలో జరుగుతున్న హనుక్కా వేడుకలలో మొదటి రోజున యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు.
READ ALSO: Health Tips: పగిలిన మడమలు వేధిస్తున్నాయా.. వీటిని ట్రై చేయండి
ఇదే సమయంలో సిడ్నీ ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్‌తో సంబంధాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీనియర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. బోండి బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరిని సిడ్నీలోని బోనీరిగ్‌కు చెందిన నవీద్ అక్రమ్‌గా గుర్తించినట్లు తెలిపారు. అతను పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన వాడని వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం 24 ఏళ్ల నవీద్ అక్రమ్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు.
నవీద్ అక్రమ్ ఎవరో తెలుసా..
పలు నివేదికల ప్రకారం.. ఈ 24 ఏళ్ల నవీద్ అక్రమ్ వాస్తవానికి పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందినవాడు. అతను సిడ్నీలోని అల్-మురాద్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఫోటోలో ఆయన పాకిస్థాన్ క్రికెట్ జెర్సీ ధరించి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కాల్పుల్లో పాల్గొన్న ఇద్దరు ముష్కరులలో ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అధికారులు ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో మూడో ముష్కరుడు కూడా పాల్గొన్నాడా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వైరల్ వీడియో ప్రకారం.. జనాలపై దాడి చేసిన వారిలో నవీద్ అక్రమ్ ఉన్నాడని, అయితే అతను నిరాయుధుడిగా ఉన్నాడని, కానీ అక్కడి నుండి పారిపోయిన తర్వాత మరిన్ని కాల్పులు జరిపాడని సమాచారం. అలాగే బోండిలోని కాంప్‌బెల్ పరేడ్‌లోని ఒక వాహనంలో అనేక ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రెస్క్యూ బాంబు డిస్పోజల్ యూనిట్ ఈ వాహనంలో ఉన్న పేలుడు పరికరాలను డిస్పోజ్ చేస్తుంది.
ఇది ఉగ్రవాద దాడి: ఆస్ట్రేలియా పోలీసులు
ఈ సందర్భంగా NSW పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ మాట్లాడుతూ.. “సంఘటన స్థలంలో లభించిన ఆయుధాల రకం… దర్యాప్తులో లభించిన మరికొన్ని ఆధారాలు ప్రకారం ఇది ఉగ్రవాద దాడి. అలాగే మేము మరణించిన నేరస్థుడికి సంబంధించిన కారులో ఒక అధునాతన పేలుడు పరికరాన్ని గుర్తించాము” అని ప్రకటించారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. “ఇది ప్రతీకారం తీర్చుకునే సమయం కాదు, పోలీసులను వారి పని చేయనివ్వాల్సిన సమయం ” అని అన్నారు.
UPDATE: A police operation is ongoing after a public place shooting by two men at Bondi Beach earlier today.
Ten people have been confirmed dead, including a man believed to be one of the shooters. The second alleged shooter is in a critical condition.
At this time, a further… https://t.co/lekTjxqf85
— NSW Police Force (@nswpolice) December 14, 2025
READ ALSO: Anil Ravipudi: మెగాస్టార్‌కు ఆ విషయంలో నో చెప్పా: డైరెక్టర్ అనిల్ రావిపూడి