NTV Telugu Site icon

Union Budget: పెన్షనర్లు, ఉద్యోగులకు బడ్జెట్‌లో తీపికబురు…!

Penshion

Penshion

కేంద్ర బడ్జెట్ అంటేనే అందరికీ గంపెడాశలుంటాయి. పైగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓట్ల జాతర జరగబోతుంది. దీంతో బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా వరాలు ప్రకటించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా మోడీ సర్కార్ మరోసారి వచ్చేందుకు బడ్జెట్‌ను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు, కేంద్ర ఉద్యోగులైతే ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరీ నిర్మలాసీతారామన్ ఎలాంటి వరాలు కురిపిస్తారోనని అందరూ ఎదురుచూస్తు్న్నారు.

Kumari Aunty: మీడియాను నేను పిలిచానా.. పోలీసులపై కుమారి ఆంటీ ఫైర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు ఈ బడ్జెట్‌లో తీపికబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ సమయంలో 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు జనవరి 2020 నుంచి జూన్‌ 2021 వరకు.. సుమారు 18 నెలలు పాటు డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ), డియర్‌నెస్‌ రిలీఫ్‌ (డీఆర్‌)ను నిలిపివేసింది. ఆ సమయంలో కోవిడ్‌-19 కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందంటూ కేంద్రం తెలిపింది. ఈ నిధులు విడుదల చేయాలని ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతున్నారు. ఈసారి మాత్రం అనుకూల ప్రకటన రావొచ్చని ఉద్యోగులు ఆశిస్తున్నారు. పైగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు సానుకూలమైన ప్రకటన రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Chhattisgarh: మావోయిస్టుల కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి, 14 మందికి గాయాలు

పైగా ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. మరోసారి మోడీ ప్రభుత్వం అధికారం కోసం సన్నద్ధమవుతోంది. గతం కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో అందరకీ రుచించేలాగానే ఈ బడ్జెట్ ఉండబోతుందని తెలుస్తోంది. మరీ బడ్జెట్ ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.