Suspend : మల్టీ జోన్ 1 పరిధిలో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్ల పై సస్పెండ్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్టీ జోన్ 1 పరిధిలోని అవినీతికి పాల్పడి నందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాటరాయళ్ళకు సహకరిస్తూ, జూదగృహలను ప్రోత్సాహిస్తూ అవినీతి కి పాల్పడుతున్న సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశం తో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు నమోదు చేసినందుకుగాను ఇదే కమిషనరేట్ లో గతంలో పని చేసి ప్రస్తుతం ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న సి. హెచ్ శ్రీధర్ ఇన్స్ స్పెక్టర్ సస్పెండ్ చేయడంతో పాటు, మతకల్లోల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు మెదక్ పట్టణ, రూరల్ ఇన్స్ స్పెక్టర్లు ఎస్. దిలీప్ కుమార్ బి. కేశవులను అలాగే అధికార పర్యవేక్షణ లోపించినందుకు గాను భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బి. రాజేశ్వర్ రావు ను మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయం కు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏ. వి. రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాట కేంద్రాలు నిర్వహిస్తునట్లుగా పోలీస్ ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆదేశాల మేరకు పేకాట కేంద్రాలపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన పేకాటారాయుళ్ల ను అరెస్ట్ చేసి విచారించిగా సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశం ముందుస్తుగానే పోలీసుల దాడులకు సంబంధించి పేకాట కేంద్రాల్లోని పేకాటారాయుళ్లకు సమాచారం ఇవ్వడంతో పేకాట కేంద్రాలను పొత్సహించేవాడని ఇందుకు సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశంకు ఆర్ధికంగా లాభం చేకూర్చడం జరుగుతుందని అధికారుల విచారణలో నిర్ధారణ కావడంతో సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మరో ఘటనలో ఇదే కమిషనరేట్ పరిధిలో ఖమ్మం పట్టణంలో 2022-23 మధ్య కాలంలో ఖమ్మం 2 టౌన్ ఇన్స్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సి. హెచ్ శ్రీధర్ స్థానిక విలేకరి ఇంటి లో ఎస్. ఎల్. ఆర్ తుపాకీ సంబంధించిన ఆరు తుటాలు లభ్యమైనట్లు ఆయుధాల చట్టంతో పాటు పలు సెక్షన్లతో బెదిరించి పంచులతతో పంచానామాలో సంతకాలు చేయించి తప్పుడు కేసు నమోదు చేయడంతో పాటు, 2022 సంవత్సరంలో క్రైం నంబర్ 310 లో 420 సెక్షన్ క్రింద నమోదైన కేసులో ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ నిందితుడికి అనుకూలంగా వ్యవహారిస్తూ కేసు దర్యాప్తు స్థితి గతులు తెలిపే యూ. ఐ కేసుల జాబితా లో కూడా సదరు కేసును లేకుండా చేసి, ఈ కేసు పూర్తిగా సివిల్ తగాదా పరిధిలోకి వస్తుందని కోర్టు ను తప్పు దోవ పట్టించినట్లుగా ఇన్స్ స్పెక్టర్ పై ఫిర్యాదు రావడంతో ఖమ్మం సిపి విచారణ జరిపి అందజేసిన నివేదిక లో ఇన్స్ స్పెక్టర్ అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పోలీసుల గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించినందుకు ప్రస్తుతం ములుగు జిల్లా లో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్ స్పెక్టర్ సిహెచ్ శ్రీ ధర్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వులను జారీ చేశారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
మరో ముగ్గురు ఇన్స్ స్పెక్టర్ల స్థాయి అధికారులను మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి అటాచ్
ఇటీవల మెదక్ జిల్లా పరిధిలో జరిగిన మతకల్లోల సమయంలో మెదక్ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ల చెందిన ఇన్స్ స్పెక్టర్లు ఎస్. దిలీప్ కుమార్,బి. కేశవులు మతకల్లోలాలు జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వహించినందుకు గాను మెదక్, పట్టణ, రూరల్ ఈ ఇన్స్ స్పెక్టర్ల తో పాటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ కేసు వ్యవహారంలో సర్కిల్ ఇన్స్ స్థాయిలో ఎస్. ఐ పనితీరు, వ్యవహార శైలిపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మహదేవ్ పూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బి. రాజేశ్వర్ రావును మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయంకు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జీ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!