Site icon NTV Telugu

AP Elections 2024: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ..! నేడు తేలనుందా..?

Ap

Ap

AP Elections 2024: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. శుక్రవారం రోజు ఢిల్లీ వేదికగా మూడు పార్టీల నేతల సమావేశం జరగాల్సి ఉండగా.. అది ఈ రోజుకు వాయిగా పడింది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బిజీ షెడ్యూల్‌ కారణంగా మీటింగ్‌ పోస్ట్‌పోయిన్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ రోజు మూడు పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు.. ఉదయం 11 గంటలకు పాట్నా పర్యటనకు వెళ్లనున్నారు అమిత్‌షా.. ఆలోగా ఈ సమావేశం జరగనుంది.. దీనిపై కోసం ఢిల్లీలోనే మకాం వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్..

Read Also: PM Modi : దేశంలోనే మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించనున్న మోడీ

మరోవైపు.. ఏపీలో 10 పార్లమెంట్‌ స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.. కనీసం 8 ఎంపీ స్థానాలైనా తమకు ఇవ్వాలని కోరుతున్నారట కమలం పార్టీ నేతలు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మొన్న రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌ షాతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలనుకున్నా.. అది కూడా వాయిదా పడడంతో.. ఇవాళ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలు ఉన్న విషయం విదితమే కాగా.. టీడీపీ, జనసేనల మధ్య ఇప్పటికే 118 చోట్ల సీట్ల పంపకాలు పూర్తి అయ్యాయి.. టీడీపీ 94 స్థానాలు, జనసేన 24 స్థానాల్లో పోటీకి సిద్ధం అయ్యాయి.. ఇక, లోక్‌సభ సీట్లలోనూ కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.. టీడీపీ 12 ఎంపీ స్థానాలు, జనసేన మూడు స్థానాల్లో పోటీకి రెడీ అవుతుండగా.. బీజేపీకి ఎన్ని సీట్లు అనేదానిపై క్లారిటీ వచ్చాక.. మిగతా స్థానాలపై టీడీపీ నిర్ణయం తీసుకోనుందట.. అయితే, బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న ఎంపీ స్థానాలపై ఇంకా అవగాహన కుదరలేదు.. విశాఖ లోక్‌సభ స్థానం కోసం బీజేపీ పట్టుబడుతోంది.. హిందూపురం, అనంతపురం, విజయవాడ స్థానాలు కూడా కావాలంటోంది. రాజంపేట, తిరుపతి, రాజమండ్రి, నరసాపురం, అరకు లోక్‌సభ స్థానాల్లో పోటీకి బీజేపీ ఏకాభిప్రాయంతో ఉందట. ఇక, జనసేనకు మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ లోక్‌సభ స్థానాలు కేటాయించనున్నారు.. అయితే, మూడు పార్టీల నేతలు నేడు తుది నిర్ణయం తీసపుకునే ఛాన్స్‌ ఉంది.

Exit mobile version