Suryakumar Yadav: అలా చేస్తూ కెమెరాకు చిక్కిన కెప్టెన్ సూర్యకుమార్.. ఇక భార్య చేతిలో బలి అయినట్టే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ అనంతరం టీంలో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోర్నమెంట్ ప్రారంభోత్సవ వేడుకల సమయంలో తీసిన ఆ వీడియోలో టీమిండియా ఆటగాళ్లు ఎంతో హుషారుగా కనిపించారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహీ స్టేడియంలో డ్యాన్స్ ప్రదర్శన ఇస్తుండగా, సూర్యకుమార్ యాదవ్ సహా భారత ఆటగాళ్లు ఆసక్తిగా చూస్తూ ఆనందించారు. ఈ తరుణంలో కెమెరా ఒక్కసారిగా సూర్యకుమార్ వైపు తిరిగింది. కెప్టెన్ నవ్వుతూ థంబ్స్ అప్ చూపించడం స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ కెప్టెన్‌ను సరదాగా ఆటపట్టిస్తూ కనిపించారు. భారత ప్లేయర్స్ మైదానం బయట జట్టు ఎంత రిలాక్స్‌గా, స్నేహపూర్వకంగా ఉంటుందో ఈ వీడియో చూపించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ వీడియోను సూర్యకుమార్ యాదవ్ భార్యే చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ వీడియోఎక్స్‌లో షేర్ కావడంతో అభిమానులు వైరల్ చేశారు. ఇక భార్య చేతిలో కెప్టెన్ బలి అయినట్టే? అని సరదాగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE: Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ రివ్యూ.. విశ్వక్ ఖాతాలో మరొక ప్లాప్?
Also Read
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
- Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
- Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Kavya Maran - Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
ఇక టోర్నమెంట్ విషయానికి వస్తే.. నమీబియా మ్యాచ్ తర్వాత టీమిండియా అసలు పరీక్ష ఎదుర్కొనబోతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరు ముందుంది. ఆ మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. వరల్డ్ కప్‌లలో భారత్ సాధారణంగా పాకిస్థాన్‌పై ఆధిపత్యం చాటింది. అయితే ఈసారి పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. పాకిస్థాన్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడుతోంది. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు వారు అలవాటు పడిపోయారు. ఇది వారికి కొంత ప్రయోజనంగా మారే అవకాశం ఉంది. అందుకే నమీబియా మ్యాచ్‌తో ఫామ్ కొనసాగించడం టీమిండియాకు చాలా కీలకం. మైదానంలో గంభీరంగా, మైదానం బయట సరదాగా ఉండే భారత జట్టు.. ఇప్పుడు వరుస విజయాలతో అభిమానులను మరింత ఉత్సాహపరచాలని చూస్తోంది.
Surya Kumar Yadav's wife caught him in 4K watching Nora Fatehi's dance performance at the opening ceremony. Hilarious reactions from Ishan Kishan and Arshdeep Singh! 😃 #SuryaKumarYadav #IshanKishan #NoraFatehi pic.twitter.com/9paBbtQg3c
— Telugu Stride (@TeluguStride) February 12, 2026
తాజావార్తలు
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!