Suryakumar Yadav: “గంభీర్ కాదు.. నన్ను కెప్టెన్ చేసింది ఈ నలుగురే”.. కెప్టెన్సీ వెనుక అసలు కథ చెప్పిన సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్పు2026లో భారత్ అదరగొట్టింది. సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా జట్టు అద్భుత ప్రదర్శన సాగించింది. ముచ్చటగా మూడోసారి కప్పు గెలిచిన టీమిండియా జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. అయితే.. ఈ సీజన్ అనంతరం ఓ ఇంటర్య్వూలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ తర్వాత సూర్యకుమార్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ వల్లే సూర్యకు జట్టు పగ్గాలు దక్కాయనే వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ అంశంపై తాజాగా సూర్య స్పందించాడు. గంభీర్ కంటే మరో నలుగురి పాత్ర చాలా కీలకమని వెల్లడించాడు. ముందు మరో నలుగురు కీలక వ్యక్తులు ఉన్నారని సూర్య స్పష్టం చేశారు. “బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలే నన్ను కెప్టెన్‌గా ప్రమోట్ చేశారు. వీళ్లే ప్రధాన పాత్ర పోషించారు. శ్రీలంక సిరీస్‌కు మూడు నాలుగు రోజుల ముందు జై షా తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. అయితే ఈ నిర్ణయం వెనుక రోహిత్, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్‌ల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందే ఈ ప్రణాళిక సిద్ధమైంది.” అని కెప్టెన్ సూర్య వెల్లడించాడు.
READ MORE: US-Iran War: హార్ముజ్ వద్ద అమెరికా బిగ్ ఆపరేషన్.. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్
Also Read
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
- Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- Hantavirus: హంటావైరస్‌పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
కెప్టెన్‌గా సూర్యకుమార్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. తాజాగా వచ్చిన ట్రోఫీతో సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మూడవ భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ చారిత్రాత్మక విజయంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక ప్రధాన రికార్డును సృష్టించాడు. ఫైనల్లో విజయంతో, సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20ఐ కెప్టెన్‌గా కూడా నిలిచాడు. ఇప్పుడు అతను అత్యధిక విజయ శాతాన్ని కలిగి ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 52 టీ20ఐ మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అతను వీటిలో 42 మ్యాచ్‌లలో గెలిచాడు. 8 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయాడు, రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. అంటే అతని కెప్టెన్సీలో, టీమ్ ఇండియా 80.77% మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇది ప్రపంచంలోని అన్ని కెప్టెన్లలో అత్యధికం. ముఖ్యంగా, సూర్యకుమార్ యాదవ్ గతంలో అత్యంత విజయవంతమైన టీ20ఐ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను అధిగమించాడు. అతని కెప్టెన్సీలో, భారత జట్టు 80.65 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. రోహిత్ 62 మ్యాచ్‌లలో 50 విజయాలు సాధించగా, టీం ఇండియా 12 మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో, పాకిస్తాన్ 78.38 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
తాజావార్తలు
-
PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు ‘కాన్వాయ్’ కట్ చేసిన ప్రధాని మోడీ!
-
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
-
Peddi :‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ విడియోతో సోషల్ మీడియా షేక్..!
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!