Site icon NTV Telugu

Suriya -Venky:సూర్యతో ప్రేమలు బ్యూటీ.. రేపే పూజ!

Suriya Venky

Suriya Venky

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. హీరో సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న కొత్త సినిమా రేపు (మే 19, 2025) ఉదయం హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

READ MORE: Bandi Sanjay: దేశ వ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్న మోడీ.. తెలంగాణలోనూ మూడు..

వెంకీ అట్లూరి, తన రొమాంటిక్ అలాగే ఎమోషనల్ కథలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సూర్యతో ఆయన చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య, తనదైన శైలిలో యాక్టింగ్‌తో ఈ సినిమాలోనూ మెప్పించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మమిత బైజు, తన సహజమైన నటనతో ఇప్పటికే దక్షిణాది సినిమాల్లో గుర్తింపు పొంది ప్రేమలతో తెలుగు వారికి కూడా దగ్గరైంది… ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

READ MORE: supritha : సురేఖ కూతురు సుప్రీతకు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రి పాలు

ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగవంశీ గత చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో, ఈ సినిమాపై కూడా అందరి దృష్టి నెలకొంది. సినిమా ఓపెనింగ్ కార్యక్రమం రేపు రామానాయుడు స్టూడియోలో జరగనుండటంతో, సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమా కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సూర్య, వెంకీ అట్లూరి, మమిత బైజు కలయికలో రాబోతున్న ఈ చిత్రం ఖచ్చితంగా ఒక బిగ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది.

Exit mobile version