Karuppu: స్టార్ హీరోపై కేసు వేయనున్న డైరెక్టర్? కోలీవుడ్‌లో కలకలం రేపుతున్న ‘కరుప్పు’ వివాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karuppu: స్టార్ హీరో సూర్య నటిస్తున్న 45వ చిత్రం ‘కరుప్పు’. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో ఈ సినిమా రిలీజ్ హాట్ టాపిక్‌గా మారినట్లు తెలుస్తుంది. ఆసక్తికరమైన యాక్షన్-ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తయినా విడుదల కాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2025 నవంబర్ నాటికే సినిమా పనులన్నీ పూర్తయ్యాయని సమాచారం.
READ ALSO: VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
Also Read
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, హీరో సూర్యపై దర్శకుడు ఆర్జే బాలాజీ కేసు వేయాలని భావిస్తున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా పూర్తయినా వ్యక్తిగత కారణాలతో నిర్మాత కావాలనే ఆలస్యం చేస్తున్నారని సమాచారం. ఆర్జే బాలాజీకి ఇవ్వాల్సిన పూర్తి పారితోషికం ఇంకా ఇవ్వలేదని, OTT డీల్ క్లోజ్ అయ్యాకే సెటిల్ చేస్తామని నిర్మాత చెప్పడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని సినీ వర్గాల సమాచారం. ఈ ఆలస్యం వల్ల దర్శకుడి కెరీర్‌కు నష్టం జరుగుతోందని, సినిమా పొటెన్షియల్ వృథా అవుతోందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాలపై నిర్మాణ సంస్థ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆర్జే బాలాజీకి, నిర్మాతలకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఇవన్నీ కేవలం పుకార్లేనని వారు కొట్టిపారేస్తున్నారు. ఈ వివాదాలన్నీ సమసిపోయి సినిమా థియేటర్లలోకి వస్తే సూర్య ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమని సూర్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.
READ ALSO: Rashmika Mandanna: మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి: రష్మిక
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?