NTV Telugu Site icon

Supriya Sule: ఓటు వేసి అజిత్ పవార్ తల్లి ఆశీర్వాదం తీసుకున్న సుప్రియా

Supriya

Supriya

దేశ వ్యాప్తంగా మంగళవారం మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. అయితే మహారాష్ట్రలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం బారామతి లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరిగింది. ఇక్కడ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే.. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ తలపడుతున్నారు. నాలుగో సారి ఇక్కడ నుంచి సుప్రియా పోటీ చేస్తున్నారు. పవార్ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. సునేత్రా పవార్‌కి ఇది తొలి లోక్‌సభ ఎన్నికలు కావడం విశేషం. అయితే సుప్రియా సూలే ఓటు వేసిన తర్వాత ఆశీర్వాదం కోసం అజిత్ పవార్ తల్లిని కలిశారు. పోలింగ్ సమయంలో ఇలా కలవడంపై రాజకీయకంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Jammu Kahmir: లష్కర్ కమాండర్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చిన భద్రతా బలగాలు..

సుప్రియా సూలే.. అజిత్ పవార్ తల్లిని కలవడంపై బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తప్పుపట్టారు. ఈ పరిణామాన్ని ఎమోషనల్ వ్యూహంగా అభివర్ణించారు. దీనిపై సుప్రియా మీడియాతో మాట్లాడుతూ.. ఆశీసుల కోసం కలవడంలో తప్పేమీ ఉందని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: YS Avinash Reddy: పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. మంగళవారంతో మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Sai Pallavi : కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యనని చెప్పేసిన సాయి పల్లవి..

Show comments