Vote Selfie: ఓటింగ్ అనేది అత్యంత రహస్య ప్రక్రియ. ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ.. వేసిన ఓటు ఎవరికి వేసారో అత్యంత రహస్యంగా ఉంచి ఓటరు మహాశయుని హక్కుకు భంగం కలగకుండా చూడాలని రాజ్యాంగం చెప్పే మాట.
తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ పోరు జరుగుతోంది. తమిళనాట మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొత్తం 21 కార్పొరేషన్లు, 130 మునిసిపాలిటీలు, 490 నగర పంచాయతీలకు ఒకే దశలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. బరిలో ఏఐఎడీఎంకే, డీఎమ్‌కే, నటుడు విజయ్ సంబంధించిన మక్కల్ ఇయాక్కం పార్టీలు తలపడుతున్నాయి. సాలిగ్రామం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నీలాంగరి పోలింగ్ బూత్…