MLA Defection Case: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం అంటూ కోర్టు స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఈలోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. ఇకపై కూడా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తగిన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పీకర్‌కు హెచ్చరించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
Vijay Sethupathi: బిచ్చగాడు పాత్రలో విజయ్ సేతుపతి.. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్, ఫస్ట్ లుక్ విడుదల
కోర్టు సూచనల ప్రకారం రెండు వారాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ కేసులపై రెండు వారాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది. ఈ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేయడానికి నాలుగు వారాల సమయం కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు రెండు వారాల్లో స్పష్టమైన వివరాలు అందిస్తే, అవసరమైతే నాలుగు వారాల సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.