Pre-Marital Relations: పెళ్లికి ముందు ఎవరినీ నమ్మకండి.. శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక హెచ్చరిక..
- మ్యాట్రిమోనీ పరిచయం.. మోసంగా మారిన ప్రేమ
- పెళ్లి పేరుతో శారీరక సంబంధం – కేసు నమోదు
- బెయిల్ విచారణలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- యువతకు జాగ్రత్త సూచించిన ధర్మాసనం
Pre-Marital Relations: నేటి కాలంలో సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా పరిచయాలు పెరిగి మోసపోతున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు ఏర్పరచుకునే శారీరక సంబంధాల విషయంలో యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా లైంగిక సంబంధంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ధర్మాసనం, పెళ్లికి ముందు ఎవరినీ సులభంగా నమ్మకూడదని స్పష్టం చేసింది.
Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో విషాదం.. ఐసీయూలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి!
ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమైన కేసు వివరాల్లోకి వెళితే.. 2022లో ఒక మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఒక యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. తాను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి, పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే, సదరు యువకుడికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయని బాధితురాలికి ఆలస్యంగా తెలిసింది. దీనిపై ఆమె నిలదీయగా, తమకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను బయటపెడతానని అతడు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతనిపై అత్యాచారం కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఒకరి గురించి పూర్తి సమాచారం లేకుండా అంతటి సాన్నిహిత్యం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. పెళ్లి పేరుతో జరిగే ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
Salim Khan: ఖాన్ ఫ్యామిలీలో విషాదం.. ఐసీయూలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి!
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?