Supreme Court: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వినతిని ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికలలో ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు ఏం కాదని చెప్పుకొచ్చింది. చట్టపరమైన, రాజ్యాంగబద్దమైన హక్కు కూడా కాదని ఈడీ చెప్పింది. ఈ మేరకు గురువారం నాడు జరిగిన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తే జైలులో ఉన్న రాజకీయ నాయకులు అందరు ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌ను హక్కుగా కోరుతారని ఈడీ వాదించింది. అయితే, ఈడీ వాదనలపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. బెయిల్ ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించింది.
Read Also: Amit Shah: నేడు పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా ప్రచారం..
కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెల్లడించనుంది. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఇక, కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం దాఖలు చేసిన పిటిషన్ పైనా అదే రోజు వాదనలు వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. కాగా, మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.