Supreme Court: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సుప్రీంకోర్టు హెచ్చరిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: చిన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడి, తమ ఉజ్వల భవితకు బాటలు వేసిన తల్లిదండ్రుల విషయంలో కొందరు పిల్లలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జీవితంలో ఎదిగేందుకు అడుగడుగునా అండగా ఉన్న పోషకులను, తాము పోషించలేం అంటూ అనాథలుగా వదిలేస్తున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఆపద వేళ బాధ్యతగా చూసుకోవాల్సిన కుమారులు, తమకు సంబంధం లేదంటూ వారిని పరాయి మనుషులుగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల వద్దు కానీ.. వాళ్లు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలని పట్టుబడుతున్నారు. అలాంటి వాళ్లను తాజాగా సుప్రీంకోర్టు హెచ్చరించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే పిల్లల్ని ఇంటి నుంచి బయటకు తోసేసే హక్కు ఆ పేరెంట్స్‌కి ఉందని చెప్పింది. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం 2007 ఇలాంటి తల్లిదండ్రులకు అండగా ఉంటుందని తెలిపింది.
Also Read
తాజాగా తన కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023లో ఈ వృద్ధ జంట కుమారుడి నుంచి పోషణ ఖర్చులు అందేలా చూడాలని.. అలాగే తమ ఆస్తులు తమకు చెందేలా చూడాలని కోరుతూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. నెలకు రూ.3000తో పాటు ఆ వృద్ధ జంట ఇంటిని ఖాళీ చేయాలని కుమారుడికి తీర్పునిచ్చింది. కుమారుడు ముంబై హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు కింది కోర్టు ఆ కుమారుడికి సపోర్టు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ కొడుకు కూడా ఒక సీనియర్ సిటిజన్. అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టేలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఆ వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈకేసును విచారించిన కోర్టు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని స్పష్టం చేసింది. ట్రైబ్యూనల్ కోర్టు తీర్పును సమర్థించింది.
తాజావార్తలు
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
OTR: నెల్లూరు వైసీపీలో మొదలైన అసంతృప్తి రగడ.. అధిష్టానం తీరుపై నేతల గుస్సా..
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!