Site icon NTV Telugu

Supreme Court: 22 ఏళ్ల నాటి ఎర్రకోట దాడి కేసులో సుప్రీం సంచలన తీర్పు

Supreme Court

Supreme Court

Supreme Court: ముగ్గురు ఆర్మీ జవాన్లను చంపిన సంచలనాత్మక 2000 ఎర్రకోట దాడి కేసులో తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. 22 ఏళ్ల నాటి ఎర్రకోటపై దాడి కేసులో సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఉగ్రదాడిలో దోషిగా తేలిన ఉగ్రవాది ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ మరణశిక్షను సుప్రీం కోర్టు సమర్థించింది. మహ్మద్ ఆరిఫ్ తన శిక్షను మినహాయించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే జీవితఖైదుతో సమానమైన శిక్షను అనుభవించానని ఆరిఫ్ కోర్టుకు విన్నవించాడు.

ఆరిఫ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌ఆర్‌ భట్‌, బేల ఎం త్రివేదిలు కూడా ఉన్నారు. ఈ సమయంలో ‘ఎలక్ట్రానిక్ రికార్డుల’ పరిశీలనకు దరఖాస్తును అనుమతించినట్లు ధర్మాసనం పేర్కొంది.’ఎలక్ట్రానిక్ రికార్డు’ను పరిగణనలోకి తీసుకోవాలనే దరఖాస్తును మేము అంగీకరిస్తున్నాము. అతను దోషిగా రుజువైంది. ఈ విషయంలో ఈ కోర్టు నిర్ణయాన్ని తమ ధర్మాసనం సమర్థిస్తుందనీ, రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది.

High Court: విద్యార్థులు జీవితాన్ని అంతం చేసుకుంటే ఉపాధ్యాయులను మాత్రమే నిందించొద్దు..

ఢిల్లీలోని ఎర్రకోటపై 22 డిసెంబర్ 2000న ఉగ్ర దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది సహా ముగ్గురు చనిపోయారు. ఈ దాడికి సూత్రధారిగా తేలిన ఆరిఫ్‌కు 2005లో ఢిల్లీ ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. 2007లో అతడు ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ కూడా అతనికి దెబ్బ తగిలింది. ఉరిశిక్షను ఢిల్లీ హైకోర్టు కూడా నిర్ధారించింది. తర్వాత 2011లో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. అతని రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లను కూడా కొట్టివేసింది.

Exit mobile version