Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు పైగా అక్కడే గడిపాడు. ఇది ఫైజ్-ఎ-ఇలాహి మసీదు. తుర్క్మాన్ గేట్ ఎదురుగా రాంలీలా మైదాన్ మూలలో ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లాగానే ఈ మసీదులో తబ్లిగీ జమాత్ జరుగుతుందని చెబుతున్నారు.…
Chidambaram: ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిపై తాజాగా మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "దేశీయ ఉగ్రవాదం" అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. "పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు…
ముగ్గురు ఆర్మీ జవాన్లను చంపిన సంచలనాత్మక 2000 ఎర్రకోట దాడి కేసులో తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.