NTV Telugu Site icon

Supreme Court: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

Sc

Sc

చండీగఢ్ మేయర్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బ్యాలెట్ పేపర్లను తారుమారు చేసి బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పంజాబ్- హర్యానా హైకోర్టులో ఈ ఫలితాలపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేసింది. కానీ, పిల్ ను జస్టిస్ సుధీర్ సింగ్, జస్టిస్ హర్ష్ బంగర్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.

Read Also: Paytm : పేటీఎం ఖేల్ ఖతం.. రూ.20500కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

దీంతో పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. మేయర్ ఎన్నిక ప్రక్రియను రద్దు చేసి.. ఎన్నికలకు సంబంధించిన పూర్తి రికార్డును సీల్ చేసి.. మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టకుండా నిషేధించి.. మొత్తం ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్‌లో పేర్కొనింది. ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

Read Also: Tirumala: ముగిసిన శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు.. తిరుపతిని కూడా తిరుమల తరహాలో..!

అయితే, మేయర్ అభ్యర్థి కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఈ విషయాన్ని ప్రస్తావించి వెంటనే విచారణ జరపాలని అభ్యర్థించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మూడు పదవులను నిలబెట్టుకుంది. ఇక, ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్-ఆప్ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. 35 మంది సభ్యుల చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్- ఆప్ లు తమ కూటమి సులభంగా విజయం సాధిస్తాయని అంచనా వేశాయి. అయితే, మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికలో బీజేపీకి అనుకూలంగా 16 ఓట్లు రాగా, ఆప్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. ఎనిమిది ఓట్లు రద్దయ్యాయి. కూటమి అభ్యర్థికి వేసిన ఓట్లను రద్దు చేశారని ఆప్ ఆరోపించింది. సభలో ఆప్- కాంగ్రెస్‌లకు 20 మంది కౌన్సిలర్లు ఉండగా, బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు, ఒక ఎంపీ ఉండటం గమనార్హం. శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు.