Site icon NTV Telugu

Supreme Court: కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్ స్వీకరణ.. విచారణ ఎప్పుడంటే..!

E

E

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తన అరెస్ట్‌పై అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. త్వరలో ఓ తేదీని చెబుతామని సూచించింది. తాజాగా కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు స్వీకరించింది. సోమవారం (15-04-2024) పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించనున్నారు.

ఇది కూడా చదవండి: Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో విచారణ

తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ముందుగా కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ సందర్భంగా హైకోర్టు.. కేజ్రీవాల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయని తెలిపింది. ముఖ్యమంత్రికి ఒకలా.. మరొకరికి ఇంకోలా చట్టం ఉండదని.. చట్టం అందరికీ సమానం అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ది కూడా చదవండి: Kavitha: కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. వాట్సప్ చాట్‌పై ప్రశ్నించే ఛాన్స్

మార్చి 21న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. రాజీనామా చేసేలా ఆదేశించాలని పలువురు కోర్టుకెళ్లినా… న్యాయస్థానం పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. మరీ ఏప్రిల్ 15న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా? లేదంటే వాయిదా వేస్తుందా వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Sanjay Singh : బీజేపీ ఆదేశాల మేరకే తీహార్ జైలు పరిపాలన.. ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version