సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేమని కోర్టు పేర్కొంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమాలను మధ్యలో మార్చలేమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసు రాజస్థాన్ హైకోర్టులో ఓ ప్రభుత్వ పోస్టు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించినది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పుల చెప్పింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
READ MORE: Stock Market: ట్రంప్ జోష్ ఒక్కరోజులోనే ఆవిరి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. 2008లో కె.మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచి సమర్థించింది. ఆ కేసు తీర్పు సరైనదని.. దానిని తప్పు అని చెప్పడానికి అవకాశం లేదని పేర్కొంది. “ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు ముందే నిబంధనలు సిద్ధం చేసి ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలి. చివరికి ఖాళీలను పూరించిన తర్వాత ఆ ప్రక్రియ ముగుస్తుంది. నిబంధనలు మార్చొచ్చని ముందుగానే చెబితే పర్వాలేదు. నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదు. కచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బందిపెట్టరాదు.” అని ధర్మాసనం పేర్కొంది.
READ MORE:Australia: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!